రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లును(ఎన్నార్సీ) అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రజల నుండి మద్దతు ఉందని అన్నారు. ఎన్నార్సీ బిల్లుతో లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుని ఈరోజు అమిత్ షా రాజ్యసభలో పవేశపెట్టారు. ఎన్నార్సీ బిల్లు చారిత్రత్మక బిల్లు అని అమిత్ షా అన్నారు. ఈ బిల్లుతో మైనార్టీల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని చెప్పారు. 
 
ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశాల్లోని వారు వివక్షను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ బిల్లు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శరణార్థులు దేశ విభజన సమయంలో తీవ్ర వివక్షకు గురయ్యారని అమిత్ షా అవేదన వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను విశ్వసిస్తున్నామని అమిత్ షా అన్నారు. 
 
ఈ బిల్లు చట్ట వ్యతిరేకం కాదని అమిత్ షా అన్నారు. ఈ బిల్లు వలన మైనార్టీలకు హక్కులు లభించటంతో పాటు ఈ బిల్లు శరణార్థుల హక్కులను కూడా కాపాడుతుందని చెప్పారు. ప్రధాని మోదీ పౌరసత్వ చట్టాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని అన్నారు. ఎన్నార్సీ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు పాకిస్థాన్ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోదీ వ్యాఖ్యలు చేశారు. 
 
రాబోయే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు అన్ని వర్గాల నుండి అభిప్రాయాలను సేకరించాలని మోదీ సూచనలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేఖించారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని దెబ్బ తీసే ప్రయత్నం మోదీ షా ప్రభుత్వం చేస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజల జీవన విధానంపై దాడి చేసే ప్రయత్నం జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: