తెలంగాణరాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రము, ఉమ్మడిగా ఉన్న సమయంలో  తెలంగాణ ఆర్టీసీలో నియమితులైన ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులిప్పుడు తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలో ఉండే ఆర్టీసీకిమార్చాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఏపీలో పుట్టి అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించినందున తమను ఏపీఎస్‌ఆర్టీసీలోకి మార్చాలని తాజాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గారికి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మల గారి కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో అర్జీలు పంపుతున్నారు. ఈ విషయము అధికారులకు పెద్ద తలనొప్పిగా ఉంది.

 

 రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏపీకి చెందిన చాలామంది ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని హలో జిల్లాల్లో ఆర్టీసీలో నియమించడం జరిగినది.. రాష్ట్రం విడిపోయిన సమయంలో కొంతమంది మాత్రమే ఏపీకి వెళ్లాలనుకున్నారు. మిగతావారు ఇక్కడే ఇక్కడ బాగానే ఉంది కదా మళ్లీ అక్కడ అభివృద్ధి చెందే రాష్ట్రానికి ఎందుకు అని భావించి తెలంగాణలోనే ఉండిపోయారు. అదీగాక ఆ సమయంలో 58:42 దామాషా ప్రకారం ఉద్యోగుల మార్పిడి జరిగినది. ఏపీఎస్‌ఆర్టీసీ పరిధిలోనే సిబ్బంది ఎక్సెస్‌ కావటంతో ఇక్కడి వారిని కూడా తీసుకో లేదు. ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉండి, ఆంధ్రప్రదేశ్ కు రాకుండా  కొందరు తెలంగాణ లోనే ఉండి పోయారు.  అందువలన వారందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రావాలని వినతిపత్రాలు భారీగా తెలంగాణ ఆర్టీసీ కార్యాలయంలో ఇస్తున్నారు.

 

టీఎస్‌ఆర్టీసీలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు దాదాపు 3 వేల మంది కార్మికుల వరకు పనిచేస్తున్నట్టు ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని ప్రభుత్వం అప్పట్లోనే తేల్చి చెప్పింది. వీటన్నింటిని పరిగణించి ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోవాలనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో తాము ఏపీకి చెందిన వారమని, ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగిందని, ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయని, తమ తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉంటున్నారని, వృద్ధులైనందున వారితో తాము ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని... ఇలాంటి కారణాలు చూపుతూ ఇప్పుడు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇలా డిపో మేనేజర్లు మొదలు ముఖ్యకార్యదర్శి కార్యాలయం వరకు రెండు మూడ్రోజులుగా వినతులు వస్తున్నాయి. తాజాగా కొందరు రిజిస్టర్‌ పోస్టు చేసి డైరెక్టుగా మంత్రి పువ్వాడ ఆఫీసుకే తమ అర్జీలు పంపడం ఆశ్చర్యకరమైన విషయము.

మరింత సమాచారం తెలుసుకోండి: