ఏపీ అసెంబ్లీ, శీతాకాల   సమావేశాలు  బుధవారం తో మూడో రోజుకు చేరాయి.  గత రెండు రోజుల నుండి అసెంబ్లీ లో అధికార ప్రతి పక్ష నేతల మధ్య మతాల యుద్ధం నెలకొంది  అసెంబ్లీ సమావేశాల్లో మూడవ వ రోజు  న  పెంచిన బస్సు ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ  . మంగళగిరి క్యాంపు కార్యాలయం నుండి  అసెంబ్లీ వరకు నారా లోకేష్   టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో వచ్చారు..

 

అసెంబ్లీ దగ్గర నుండి పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి పాదయాత్రగా లోపలికి నడుచు కుంటూ  వస్తున్న సమయంలోఅసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీలకు కొంచెం లో  ప్రమాదంనుండి బయట పడ్డారు ... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా  భద్రతా కోసం ఉంచిన డ్రోన్ కెమెరా  విద్యుత్  తీగలకు తగిలి కిందపడిపోయింది.

 

డ్రోన్ ఒక్కసారిగా కిందపడటంతో ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్సీలు అంత ఉలిక్కి పడ్డారు భయంతో ఏం జరిగిందో అర్థంకాక గందరగోళ స్థితిలో  ఉండిపోయారు.. ప్రమాదం తప్పి పోవడం తో  అక్కడ ఉన్న అందరు ఊపిరి పీల్చుకున్నారు.అసెంబ్లీ ఆవరణలో భద్రత కోసం.. ఈ డ్రోన్‌ను పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది..

 

ప్రతి రోజు ఈ డ్రోన్ కెమెరాతో నిఘా పెడుతూ నే ఉన్నారట . ప్రతి రోజు లాగా నే ఈ రోజు కూడా పైకి  ఎగిరిన డ్రోన్  అక్కడ  ఉన్న  విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే  అక్కడే ఉన్న పోలీసులు కూడా అప్రమత్తమై సంఘటన స్థలాన్ని కి చేరుకొని వెంటనే అక్కడి నుండి  డ్రోన్‌ను తొలగించి వేశారు .ఈ ఘటన లో ఎవరికీ ఏ ప్రమాదం జరగ లేదు అంటూ అక్కడ ఉన్న పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: