అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని ఎవరు అనుకోరు... ఎన్ని కష్టాలు పడైన అమెరికా వెళ్లి అక్కడ ఏ చిన్న  జాబ్ చేసినా చాలు భారీగానే సంపాదించొచ్చు అని  కలలు కనే వారు చాలా మంది ఉన్నారు. అక్కడికెళ్తే బాగానే డబ్బులు సంపాదించడమే  కాదు నాలుగు రాళ్లు  వెనకేసుకోవచ్చు  కూడా అనే ఆశతో ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. అమెరికా వెళ్లడం కోసం పడరాని కష్టాలు పడుతూ వుంటారు చాలామంది. అమెరికా వెళ్లాలనే కోరిక ఉంటే సరిపోదు దానికి డబ్బు కూడా బాగానే కావాలి కదా మరి . అందుకే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలకు తెగించి మరి అమెరికా వలస వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనాలు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రయత్నం చేశారు. 

 

 

 

  అమెరికా వెళ్లి అక్కడ నాలుగు డబ్బులు వెనక్కి వేసుకుందామని అనుకున్నారు. ధీనికోసం అక్రమ వలసకు శ్రీకారం చుట్టారు. చివరకు అమెరికా వరకు చేరుకున్నారు. అది ఎలా అనుకుంటున్నారా... వాషింగ్ మెషిన్ లో దాక్కుని ప్రయాణించి  . ఏంటి ఆశ్చర్యపోయారూ  కదా మీకు లాగే అక్కడ అమెరికా అధికారులు కూడా అవాక్కయి పోయారు. ఇంతకీ ఈ కథేంటో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే... తాజాగా అమెరికాకు చేరుకుని ఓ కంటైనర్ ను  అక్కడి అధికారులు తనిఖీ చేశారు. అయితే గృహోపకరణాలు లో తరలించిన కంటైనర్ లో అక్రమంగా అమెరికాకు వచ్చిన 11 మంది చైనీయులను  గుర్తించి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. 

 

 

 

 ఇటీవలే మెక్సికో నుంచి గృహోపకరణాల తో ఒక కంటైనర్ వచ్చింది. కాగా ఆ కంటైనర్ ను  కాలిఫోర్నియా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది సరిహద్దుల్లో  తనిఖీ చేసి ఆశ్చర్యపోయారు. ఇటీవలే ఇలాంటి కంటైనర్ లలోనే  మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న  అనుమానంతో కంటైనర్  మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు అధికారులు.కాగా  గృహోపకరణాల్లో  దాక్కుని అమెరికా లోకి అడుగు పెట్టిన 11 మంది చైనీయులను  గుర్తించారు అధికారులు. ఓ వ్యక్తి ఏకంగా వాషింగ్ మెషిన్ దాక్కొని ప్రయాణం చేస్తుండగా చూసి అధికారులు అందరూ విస్తుపోయారు. ఇంకేముంది ఆ 11 మందిని.. ఆ  కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు .

మరింత సమాచారం తెలుసుకోండి: