అసెంబ్లీ లో శీతాకాల సమావేశాల్లో భాగంగా  మూడవ రోజు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మతాల యుద్ధం నడుస్తోంది ఈ క్రమం లోనే జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు ..  వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం జగన్ సర్కార్ ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని  ఆయన తెలిపారు.

 

టీడీపీ హయాంలోనే  ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని  చంద్రబాబు ప్రయత్నించారని.. కానీ ఆయన పూర్తీ చేయలేక  మధ్యలోనే వదిలేశారన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని.. దీనిని వ్యతిరేకించడం మంచి పద్దతి కాదు అని మాట్లాడరు .ఇంగ్లీష్ మీడియం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అంటూ  రాపాక వరప్రసాద్ రావు.

 

గతంలో ఎంతోమంది విద్యార్థులు ఇంగ్లీష్ రాకపోవడంతో మంచి ఉద్యోగాలు పొంద లేక పోయారు అని .. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో  ఆర్థిక ఇబ్బందులతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేరలేని పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారన్నారు. ఈ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని.. స్వాగతించాలని అభిప్రాయపడ్డారు. ఇక ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు రాపాక వరప్రసాదరావు. సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఆ విషయాన్ని చెప్పనక్కరలేదని.. ప్రతిపక్ష నేత అలాంటి పరుష పదజాలాన్ని ఉపయోగించడం తప్పు అన్నారు .

 

ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం విధానాన్ని తప్పుబడుతు. రోజుకో ట్వీట్‌తో జగన్ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాపాక మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం ఇప్పుడు  రాజకీయ వర్గాల్లోఆసక్తి కరంగా మారింది. ఓవైపు అధినేత వ్యతిరేకిస్తున్న ఇంగ్లీష్ మీడియం విధానాన్ని రాపాక స్వాగతిస్తున్నాననడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. గతంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కూడా రాపాక జగన్‌పై ప్రశంసల కురిపించారు. మరి రాపాక వ్యాఖ్యలపై జనసేన  అధినేత పవన్ కళ్యాణ్  ఎలా స్పందిస్తాడో మరి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: