విపక్షాల విమర్శలు, నిరసనల మధ్య లోక్ సభ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును ఈరోజు అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టాడు. అయితే రాజ్యసభలో తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ఇప్పుడు అందరి చూపు పెద్దల సభపై నిలిచింది. ఈ బిల్లుపై చర్చల కోసం ఆరు గంటల సమయం కేటాయించడం జరిగింది. లోక్ సభ లో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఉండడం వలన పౌరసత్వ సవరణ బిల్లు సులభంగా ఆమోదం పొందింది. కానీ బిజెపి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏకు రాజ్యసభలో ఎక్కువ సంఖ్యా బలం లేకపోవడంతో ఈ వివాదాస్పద సవరణ బిల్లు పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.


ఏది ఏమైనప్పటికీ, ఆర్టికల్ 370ని రద్దు ఎలా చేశారో ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ మద్దతుతో పెద్దల సభలో బిల్లును నెగ్గించుకునేందుకు బిజెపి పార్టీ వ్యూహా రచన చేసింది. లోక్ సభలో సుదీర్ఘ చర్చల తర్వాత 311–80 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసినదే. అయితే రాజ్యసభలో కూడా సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత ఇంకా ప్రసంగిస్తూ.. పౌరసత్వ బిల్లు ఒక చారిత్రాత్మకది. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. అది మాత్రం చట్ట వ్యతిరేకం కాదని చెప్పారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం ఏ మాత్రం ఆందోళన పడాల్సిన అవసరమే లేదని, ధైర్యంగా ఉండమని, వారిని ఎవరైనా భయపెట్టడానికి ప్రయత్నిస్తే.. భయపడవద్దని చెప్పారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే నడుస్తుందని.. మైనారిటీ వ్యక్తులకు రక్షణ ఎల్లవేళలా కల్పిస్తుందని అమిత్ షా వెల్లడించాడు. అదేవిధంగా.. పౌరసత్వ సవరణ బిల్లు పై చాలామంది తప్పుడు ప్రచారాలు చేశారని, అటువంటిదేమీ ఉండదని, సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం అసలే కాదని... ముస్లిం పౌరులు భారతీయ పౌరులుగానే ఉంటారని స్పష్టం చేశారు.


బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మత వివక్షకు చాలామంది గురై అక్కడి పరిస్థితులను తాళలేక భారత దేశానికి వలసలు వచ్చారు. అయితే ఇలా వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించాలనే తపనతోనే మోడీ సర్కార్ ఈ బిల్లును తీసుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: