ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఇంత మంచి వర్షాలు పడినా రాయలసీమలోని ప్రాజెక్టులను ఎందుకు నింపలేకపోయారని ప్రశ్నిస్తున్నారని గతంలో ఎన్నో సందర్భాలలో ఇదే విషయం గురించి ప్రశ్నించానని అన్నారు. ఈ సంవత్సరం భారీ వర్షాలు పడినా రాయలసీమలోని ప్రాజెక్టులను నింపుకోలేకపోతున్నామని ఇది మన కర్మ అని ఎన్నెన్నో సందర్భాలలో ఈ విషయం గురించి  మాట్లాడానని జగన్ చెప్పారు. 
 
ఇరిగేషన్ డిపార్టుమెంట్ రివ్యూ సమావేశాల్లో ఈ విషయం చెప్పానని జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయిందని ఇదే చంద్రబాబు నాయుడు చేయాల్సిన సమయంలో చేసి ఉంటే ప్రతి నీటి బొట్టును ప్రతి ప్రాజెక్టులో పెట్టుకొని ఉండేవాళ్లమని అన్నారు. వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లిపోతుందని రాయలసీమలో ప్రాజెక్టులు మాత్రం నిండటం లేదని అన్నారు. 
 
ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి చిత్తశుద్ధి పెట్టి ఉంటే ఈరోజు డ్యాముల్లో నీరు నిల్వ ఉండేదని, డ్యాములు పూర్తి స్థాయిలో నిండేవని అన్నారు. 10 టీఎంసీలు స్టోర్ చేయాల్సిన చిత్రావతి ప్రాజెక్టులో 6.8 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ చేయగలిగామని జగన్ అన్నారు. గండికోట రిజర్వాయర్ కెపాసిటీ 26.85 టీఎంసీల కెపాసిటీ ఐతే కేవలం 12 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలిగామంటే చంద్రబాబు నాయుడిని చూసినప్పుడు ఈయన మనిషేనా అనిపిస్తుందని జగన్ అన్నారు. 
 
చంద్రబాబు గడచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పిన ప్రాజెక్టుల గురించి విన్న పాపాన పోలేదని అన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు నింపలేకపోవడానికి కారణం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ధ్యాస పెట్టలేదని చంద్రబాబు ధ్యాస పెట్టి ఉంటే ప్రతి ప్రాజెక్టు నిండు కుండలా ఉండేదని జగన్ ఆన్నారు. జూన్ నెలలోపు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని అన్నారు. గత ప్రభుత్వ పాలన వైఫల్యాలే రాయలసీమలోని కరువుకు కారణమని జగన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: