ఏ ప్రాంతం లోనైనా ఇప్పుడు చాలామంది ఈజీగా డబ్బు సంపాదిస్తుంది వ్యభిచార గృహాలమీద. అంతేకాదు కొన్ని కాస్ట్లీ ప్రాంతాల్లో బ్యూటీ పార్లర్లను స్థాపించి హైటెక్ లెవల్లో వ్య్భిచారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వ్యభిచారంలో పాల్గొనే అమ్మాయిలు దాదాపు 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావడం ఆసక్తికరం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిలో కొంతమంది నాలుగు పదుల్లో వచ్చే జీతం ఉన్న సరిపోక సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.  పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో అనేకచోట్ల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలను పోలీసులు రీసెంట్‌గా సీజ్ చేశారు. రెండు బ్యూటీపార్లర్లతో పాటు మరో రెండు చోట్ల నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్లపై ఏకకాలంలో దాడులు చేసి 29 మంది సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలించారు. వ్యభిచార నిర్వాహకులు, విటులులతో కలిపి మరో 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఖ్య చూసి పోలీసులే షాకవుతూన్నారు.  

 

జాదవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రిన్స్ అన్వర్ షా రోడ్‌లోని ఓ భవనంలో మూడో అంతస్తులో నిర్వహిస్తున్న వేశ్యాగృహంపై సోమవారం పోలీసులు రైడ్ నిర్వహించారు. ఈ క్రమంలో సెక్స్‌రాకెట్ నిర్వాహకుడితో పాటు 8 మంది వ్యభిచారిణులను అరెస్ట్ చేశారు. అదే సమయంలో భవానీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగవాన్ మహావీర్ శరణి ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా సెంటర్‌ మీదా మెరుపు దాడి చేసి 10 మంది సెక్స్‌వర్కర్లు, తొమ్మిది మంది కస్టమర్లతో పాటు మేనేజర్‌ని అరెస్ట్ చేశారు.

 

మూడవ దాడిలో, ఇద్దరు కస్టమర్లు, వేశ్యాగృహం యజమాని మరియు నిర్వాహకుడిని గారియాహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్బహారీ అవెన్యూ ప్రాంగణంలోని మొదటి అంతస్తు నుండి అరెస్టు చేశారు. ఆరుగురు సెక్స్ వర్కర్లను తొలగించారు. సెంట్రల్ కోల్‌కతాలోని న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మీర్జా గాలిబ్ వీధిలో గల గైస్ అండ్ డాల్స్ బ్యూటీపార్లర్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ పార్లర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడితో పాటు ఆరుగురు సెక్స్‌వర్కర్లు, ముగ్గురు కస్టమర్లను అరెస్ట్ చేశారు.

 

కోల్‌కతాలోని సౌత్, సెంట్రల్‌ జోన్లలోని అనేక చోట్ల ఈ దాడులు నిర్వహించినట్లు జాయింట్ కమిషనర్ (క్రైమ్) మురళీధర్ శర్మ తెలిపారు. సెక్స్‌వర్కర్లను బాధితులుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని, కస్టమర్లు, వ్యభిచార నిర్వాహకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించామన్నారు. నిందితులపై ఆయా పోలీస్‌స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్కడ దొరికిన అమ్మాయిలను చూసి కొంతమంది ఛీ కొడుతున్నారు. తల్లి దండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తే నాలుగు పదుల సంఖ్య పైనే జీతాలను అందుకుంటూ కూడా ఇంకా జల్సాలకోసం ఇలాంటి పాడు పని చేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే సమాజంలో మిగతా వాళ్ళ మీద గౌరవం పోతోంది.  
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: