ఈ ప్రపంచంలో ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరి ఆలోచనలు మరొకరికి ఎంత మాత్రం అంత పట్టవు. అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ... తన పిల్లల బాధ్యత చూసుకునేందుకు తన భర్తకి త‌న చెల్లినే ఇచ్చి రెండో పెళ్లి చేసిన ఘనత దక్కించుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్య ప్రదేశ్ లోని బింద్‌ జిల్లాలోని గూడవాలి గ్రామానికి చెందిన దీపు ప‌రిహార్ (35), వినీత (28) దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.

 

ప్రస్తుతం వినీత గూడవాలి గ్రామ సర్పంచ్ గా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు తన పిల్లలను చూసుకోవటం కష్టతరమైనది. ఈ క్రమంలోనే మరో పెళ్లి చేసుకుంటానని భర్త దీపు ప‌రిహార్‌ భార్య వినీత‌ ను కోరాడు. భ‌ర్త రెండో పెళ్లికి అంగీకరించిన వినీత తన చెల్లి రచన(22)ను ఇచ్చి తన భర్తకు రెండో పెళ్లి చేసింది. ఇదే వేదికపై వినీతకు పరిహార్‌ తాళి కట్టి దండాలు మార్చుకున్నారు. ఈ పెళ్లికి గూడవాలి గ్రామ‌స్తులు అంద‌రూ హాజ‌ర‌య్యారు. వినీత చేసిన ప‌నిని స‌మ‌ర్థించ‌డంతో పాటు ఆమె పై ప్ర‌శంస‌లు కురిపించారు.

 

ఈ సందర్భంగా పరిహార్‌ మాట్లాడుతూ.. వినీత సమ్మతితోనే రచనను తాను పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. ఓ ప్ర‌జాప్ర‌తినిధిగా...అందులోనూ మ‌హిళా స‌ర్పంచ్ గా ఉన్న వినీత త‌న భ‌ర్త‌కు త‌న చెల్లినే ఇచ్చి రెండో పెళ్లి చేయ‌డం అక్క‌డ సంచ‌ల‌నంగా మారింది. త‌న రెండో పెళ్లి గురించి దీపు ప‌రిహార్ మాట్లాడుతూ త‌న భార్య వినీత ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురైంది... మ‌రో వైపు స‌ర్పంచ్ గా కూడా బాధ్య‌త‌లు ఎక్కువుగా ఉన్నాయి. అదే విధంగా పిల్లలను చూసుకునేందుకు ఎవరూ లేరు. దీంతో వినీత చెల్లిని పెళ్లి చేసుకున్నాను అని పరిహార్‌ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: