అక్కినేని వారసుడు నాగచైతన్య దగ్గుబాటి వారసుడు వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వెంకీ మామ. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్ లో  కూడా కలిసి సందడి చేయబోతున్నారు. కాగా  ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పాటలు సహా  ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది. అది కాకుండా అటు  ప్రేక్షకుల్లో రియల్ లైఫ్ మామ అల్లు సినిమాలో కూడా మామా అల్లుళ్లు గా అదరగొట్టనుండడంతో ఈ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విడుదల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారూ  అభిమానులు . ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో  నాగచైతన్య వెంకటేష్ తమదైన స్టైల్ లో అదరగొట్టేసారు. 

 

 

 కాగా  ఈ సినిమాలో  వెంకటేష్ సరసన టాలీవుడ్ హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా... నాగచైతన్య సరసన అందాల భామ రాశిఖన్నా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వెంకీ మామ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . కేఎస్ రవీంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో సమంత కనిపించబోతుంది అని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అక్కినేని వారి కోడలు నాగచైతన్య భార్య సమంత వెంకీ మామ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందని సమాచారం. అయితే వెంకీ మామ సినిమా కథలో  అతిథి పాత్ర చాలా కీలకమైనదట. 

 

 

 ఈ క్రమంలో అతిథి పాత్రలో సమంత అయితేనే కథ పరంగా.. క్రేజ్  పరంగాను బాగుంటుందని ఉద్దేశంతోనే ఈ చిత్రంలో సమంతను అతిథి పాత్ర కోసం సెలెక్ట్ చేసారట. అయితే కావాలనే ఇప్పుడు వరకు ఈ విషయాన్ని ఎక్కడా తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో  ఈ వార్త బయటకు వచ్చినట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వినోదభరితంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈనెల 13వ తేదీన రానుంది. ఇక రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు రీల్ లైఫ్ లో సందడి చేసి ఎంతగా అభిమానులను ఎంతగా అలరిస్తారో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: