దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ అత్యాచారం, ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌లో క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. నలుగురు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురై, ఆ తర్వాత పాశవికంగా పెట్రోల్ పోసి చంపబడ్డ దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఎదురుకాల్పులా లేక బూటకపు ఎన్‌కౌంటరా అన్నది తేలాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రిటైర్డ్ సుప్రీం న్యాయమూర్తితో ఎంక్వైరీకి న్యాయస్థానం ప్రతిపాదించింది.అయితే, ఇదే త‌రుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత ఒక‌రు వివాదాస్ప‌ద కామెంట్ చేశారు. అలా వార్త‌ల్లో నిలిచింది కామారెడ్డి జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ శోభ.

బైక్ వాడుతున్నారా..పోలీసులు ఇంకో దిమ్మ‌తిరిగే షాక్ ఇవ్వ‌బోతున్నారు


కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన మహిళా శిశు సంక్షేమ సంఘ సమావేశంలో జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ శోభ  వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశార‌ని స‌మాచారం. దిశ వంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, వాటన్నింటిని ప్రభుత్వంపై రుద్దడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. నిందితులు అడ్డుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పే దైర్యం లేక దిశ తన చెల్లెలికి ఫోన్ చేసిందని...చెల్లెలికి కాకుండా తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకువెళ్లేవారు కదా అని ఆమె అన్నారు. దిశ తన తల్లిదండ్రులతో సఖ్యతగా లేదేమో అనిపిస్తుందని ఆమె అన్నారు. గెజిటెడ్ అధికారిగా ఉన్న దిశకు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదా అని ఆమె ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం మాత్రం ఎంతమందిని రక్షిస్తుందని జెడ్పీ చైర్‌ప‌ర్స‌న‌ర్‌ అన్నారు. ఇప్పటికైనా దిశ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అన్నారు. 

హైద‌రాబాద్ మెట్రోలో ఫ్రీ వైఫై...అస‌లు షాక్ ఏంటో తెలుసా? 

 

ఇదిలాఉండ‌గా, కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి చేప‌ట్టిన‌ దఫేదార్‌ శోభ నిజాంసాగర్‌ జెడ్పీటీసీ సభ్యురాలు. జిల్లాలో 22 జెడ్పీటీసీలకుగాను టీఆర్‌ఎస్‌ పార్టీనుంచి 14 మంది సభ్యులు విజయం సాధించింది. జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా, తాజా మాజీ జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు భార్య శోభ నిజాంసాగర్‌ నుంచి గెలుపొందడంతో ఆమెను జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. కాగా, ఆమె ఈ వివాదాస్ప‌ద కామెంట్లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: