2002లో భార‌త దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన‌ గుజరాత్ గోద్రా స్టేషన్ రైలు దహనం తర్వాత జరిగిన అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని నాటి గుజరాత్ ప్రభుత్వంకు క్లీన్ చిట్ లభించింది. అల్లర్లకు అప్పటి మోదీ ప్రభుత్వంకు ఎలాంటి సంబంధం లేదని, ఈ అల్లర్లతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికీ సంబంధం లేదని నానావతి-మెహతా కమిషన్ తేల్చి చెప్పింది. గుజరాత్ అసెంబ్లీకి తమ నివేదికను బుధవారం ఈరోజు సమర్పించిన ఈ కమిషన్ ఆ అల్లర్లు ఒకరి ఆధ్వర్యంలో జరిగినవి కావని తేల్చిచెప్పింది.

                                  

అయితే 2002 ఫిబ్రవరి 27న అల్లరి మూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టారు. దీంతో ఎస్-6 కోచ్‌లో ప్రయాణిస్తున్న మొత్తం 59 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులే అత్యధికంగా ఉన్నారు. 2002లో ఈ ఘటన కారణంగా గుజరాత్‌లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా మరణించిన వారిలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. 

                                    

అయితే ఈ మారణహోమం 2002 సంవత్సరంలో దాదాపు మూడు రోజుల పాటు జరిగింది. అప్పట్లో ఈ మారణహోమం పెను సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన ఆనాటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి రాజధర్మం పాటించలేదంటూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి చురకలంటించారు. అయితే ఈ మారణహోమం మూడు రోజులు జరిగినప్పటికీ ఆ సమయంలో పోలీసులు సైతం విఫలమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: