పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఇప్పుడు కొంతమందిలో ఆందోళన కలిగిస్తుంది. కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతే కాకుండా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు మంగళవారం బంద్ కూడా నిర్వహించాయి.

 

 

ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ దేశంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారంతా దేశ పౌరులుగానే కొనసాగుతారని భరోసా ఇచ్చారు. బుధవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆయన రాజ్యసభలో ప్రవేశపెడుతూ ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమనే చెడు ప్రచారం సాగుతోందని, ఇది అసత్యమని, స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. భారత్‌లో ముస్లింలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదని, వారంతా ఇక ముందూ ఈ దేశంలో భద్రంగా జీవించవచ్చని అన్నారు.

 

 

తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా భరోసాతో జీవించాలని, భయపడాల్సిన అవసరం లేదని అమిత్‌ షా కోరారు. ఇకపోతే ప్రస్తుతం 1955లో నుండి అమలులో ఉన్న పౌరసత్వ చట్టం నిబంధనలను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నిబందనల ప్రకారం ఎవరైనా ఇతర మార్గాల్లో దేశంలో ప్రవేశిస్తే వారిని చట్ట వ్యతిరేక కాందిశీకులుగా పరిగణిస్తారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌కు వచ్చి నిర్దేశిత సమయానికి మించి ఇక్కడే ఉండే వారిని అక్రమ వలసదారులుగా శరణార్థులుగా గుర్తిస్తున్నారు. తాజా సవరణతో అలాంటి వారికి భారతీయ పౌరసత్వం పొందడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు..

 

 

అయితే మరోవైపు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి భారత్‌కు తరలివచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కానీ మైత్ షా మాత్రం ఈ బిల్లుతో లక్షలమంది తలరాతలు మారబోతున్నాయని తెలియచేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: