ఇండస్ట్రీలో  లేడీ సూపర్‌స్టార్ నయనతార తానేంటో తాను బాగా నిరూపించేసుకున్నారు. అందుకే ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నారు అని  కోలీవుడ్ వర్గాలు వేలాడిస్తున్నాయి. నయనతార భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నయన్ తన ప్రియుడు, ప్రముఖ దర్శుకడు విఘ్నేష్ శివన్‌తో కలిసి కన్యాకుమారిలోని తిరుచెందూర్ ఆలయా దర్శనకి కూడా వెళ్లడం జరిగింది. అక్కడ బీజేపీ మాజీ ఎంపీ అయిన నరసింహన్‌ను నయన్ కలిశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో నరసింహన్ మాటల మధ్యలో బీజేపీలో చేరితే బాగుంటుంది అని అన్నారు అని సమాచారం.

 

 ఇక ఈ విషయంపై నరసింహన్ మీడియా ద్వారా తెలియచేస్తూ.. ‘నేను నయనతార అనుకోని ఆలయంలో కలవలేదు. అనుకోకుండా ఇద్దరం అక్కడే ఉన్నాం. ఇటీవల నయన్ హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ ఆడవాళ్లను కాపాడటానికి మరింత కఠినమైన చట్టం తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం గురించి నేను నయన్‌తో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంలో చట్టాలు, నిబంధనలు కఠినంగా ఉన్నాయని తెలిపాను.

 

ఈ కారణం వల్లనే నేను ఆమెను బీజేపీలో చేరితే బాగుంటుందని తెలిపాను. ఎందుకంటే సౌత్‌లో నయనతారకు ఓ స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉండడం చాల గమనార్థకం. ఆమె రాజకీయాల్లోకి వస్తే ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఆమె ఆలోచనలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. అయితే నయన్ దీనిపై స్పందించకుండా కేవలం నవ్వి ఊరుకున్నాను’ అని తెలియచేయడం జరిగింది.

 

అయితే నయన్‌కు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ముందు నుంచీ లేదు. ఆమె సినీ రంగంలో ఉంటూనే మీడియా ముందు మాట్లాడటానికి ముందుకు రారు. అలాంటిది రాజకీయాల్లోకి వెళ్లి ప్రజల మధ్య నిలబడి ప్రసంగాలు ఎలా చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా  ఇది కాకుండా 2020లో విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: