వైసీపీ పార్టీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సమయంలో మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈరోజు ఉదయం లేవగానే నారా లోకేశ్ తో ప్రెస్ మీట్ పెట్టించారని రోజా అన్నారు. లోకేశ్ ప్రెస్ మీట్ లో లోకేశ్ ను చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయని చెప్పారని లోకేశ్ ను చూస్తే నా కాళ్లు కూడా వణుకుతున్నాయని రోజా ఎద్దేవా చేశారు. లోకేశ్ మంగళగిరి అని పలకడానికి కూడా ట్యూషన్ పెట్టించుకున్నాడని రోజా అన్నారు.
 
చంద్రబాబు నాయుడు కళాకారులకు అన్యాయం చేస్తున్నాడని అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తర సమయంలో తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. 
 
చంద్రబాబు తనకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను చేసిన అభివృద్ధిని చూసిన తరువాతే ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు 50 సంవత్సరాలుగా పీహెచ్‌డీ చేస్తూనే ఉన్నారని అన్నారు. చెవిరెడ్డి చంద్రబాబు విద్యార్హతలపై ఆరోపణలు చేయటంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ సభ్యులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు వంశీని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని స్పీకర్ ను ప్రశ్నించారు. స్పీకర్ వంశీ ప్రస్తుతం ఏ పార్టీలో లేరని అందుకే ప్రత్యేక సభ్యుడిగా గుర్తించానని చెప్పారు. స్పీకర్ తనకున్న విచక్షణాధికారంతోనే వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించానని అన్నారు. వంశీ 181, 182, 183 సీట్లలో ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చని స్పీకర్ తెలిపారు. వంశీ ఇప్పుడున్న సీట్లోనే కూర్చుంటానని కోరగా అలా కుదరదని స్పీకర్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: