అతి త్వరలోనే  మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవితకు మంచి రోజులు రాబోతున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీగా కవిత పోటి చేసి ఓటమి పాలైన విషయం అందరికి  తెలిసిందే కదా.  ఆ తర్వాత నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడం జరిగింది. అయితే కవితను రాజ్యసభకు పంపేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్దం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీనియర్ నేత కేశవరావు పదవి కాలం 2020 మార్చిలో ముగుస్తుంది. అతని స్థానంలో కవితను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 


 ఇకపోతే మార్చిలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగియనుంది. ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నాయిని నర్సింహ్మారెడ్డి, రాములు నాయక్ ల పదవీ కాలం ముగియనుంది. వీరి స్థానంలో కేశవరావును శాసన మండలికి తీసుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. కేశవరావుకు అవసరమైతే శాసనమండలి చైర్మన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని టాక్. 

 

అయితే మార్చి నాటికి తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఏదేమైనా కవిత మరో సారి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు . ప్రస్తుతం ఢిల్లీలో టీఆర్ఎస్ లోక్ సభ శాసనసభా పక్ష నేతగా టీడీపీ నుంచి అరువు వచ్చి ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు ఉన్న సంగతి అందరికి తెలిసిందే కదా. గులాబీ ఎంపీల్లో ఆ స్థాయి నేత లేకపోవడం కవిత వినోద్ లాంటి వారు ఓడిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నామాను టీఆర్ఎస్ పక్ష నేతగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది .

 

ఇప్పటికే  టీఆర్ఎస్ పార్టీని తన కుమారుడు కేటీఆర్ కు అప్ప చొప్పిన కేసీఆర్.. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ను కూతురుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు గులాబీ పార్టీలో చర్చకొనసాగుతుంది. మరి కేకే స్థానంలో రాజ్యసభకు పంపిస్తారా? లేక కేకేను అలానే ఉంచి రాజ్యసభకు నామినేట్ చేస్తారా అన్నది తెలియాల్సిన విషయం ఇంకా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: