తమిళ ప్రజల అభిరుచులు చాలా వెరైటీగా ఉంటాయి. తమిళ ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఒకటి రాజకీయం అయితే మరొకటి సినిమా రంగం. రెండిటిలో ఎక్కువగా తమిళ ప్రజలు సినిమా రంగానికి చెందిన వాళ్లపై ఎక్కువ అభిమానం చూపిస్తారు. ఇంకా బాగా అభిమానం ఎక్కువైతే సదరు అభిమానించే వ్యక్తికి గుడి కట్టడం గ్యారెంటీ. ఇటువంటి నేపథ్యంలో తమిళంలో ఎక్కువగా అభిమానులను సొంతం చేసుకున్న నయనతార తాజాగా పొలిటికల్ ఫీల్డులోకి రాబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల నయనతార ప్రముఖ డైరెక్టర్ మరియు లవర్ అయినా విఘ్నేష్ శివన్‌తో కలిసి కన్యాకుమారిలోని తిరుచెందూర్ వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే సమయంలో బిజెపి పార్టీకి చెందిన మాజీ ఎంపీ నరసింహన్ ని ఆ సందర్భంలో నయనతార కలిసినట్లు ప్రస్తుతం వార్తలు కోలీవుడ్లో ఇండస్ట్రీలో మరియు మీడియాలో గట్టిగా వినబడుతున్నాయి.

 

అదే సందర్భంలో నరసింహన్ నయనతార ని బీజేపీ పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో తనపై నయనతార పై వస్తున్న వార్తలపై బిజెపి మాజీ ఎంపీ నరసింహన్ స్పందించారు. నరసింహన్ మీడియా ద్వారా తెలియచేస్తూ.. 'నేను నయనతార అనుకోని ఆలయంలో కలవలేదు. అనుకోకుండా ఇద్దరం అక్కడే ఉన్నాం. ఇటీవల నయన్ హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ ఆడవాళ్లను కాపాడటానికి మరింత కఠినమైన చట్టం తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.

 

ఈ విషయం గురించి నేను నయన్‌తో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంలో చట్టాలు, నిబంధనలు కఠినంగా ఉన్నాయని తెలిపాను. ఈ సందర్భంలో బీజేపీ పార్టీలో చేరితే బాగుంటుందని భవిష్యత్తు ఉంటుందని ముఖ్యంగా సౌత్లో నీలాంటి క్రేజ్ కలిగిన హీరోయిన్ బిజెపి లో చేరితే తిరుగుండదని నయనతారకి చెప్పడం జరిగిందని కాని ఆమె నవ్వేసి ఊరుకోవడం జరిగిందని సదరు బిజెపి మాజీ ఎంపీ నరసింహన్‌ తెలిపారు.  అయితే మరోపక్క వచ్చే ఏడాది లవర్ విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవడానికి నయనతార ఏర్పాట్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు… అలాంటి సమయంలో ఆమె రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తారు అన్న ప్రశ్నలు మరొక పక్క వినబడుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: