తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటనలో భాగంగా మహతి ఆడిటోరియం నుండి మాట్లాడుతూ గజ్వేల్ లో పని లేకుండా ఎవరూ ఉండే పరిస్థితి లేకుండా ఉండాలని అన్నారు. ప్రతి ఇంటికి పాడి పశువులు ఇచ్చి ప్రతి ఇళ్లు కళకళలాడాలని సీఎం అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే వాళ్లందరికీ ఇళ్లు ఉండాలని అన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని తెలంగాణ రాష్ట్రంపై కూడా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని సీఎం అన్నారు. 
 
ప్రజలు అధికారులు, కలెక్టర్ల సేవలు వినియోగించుకోవాలని అన్నారు. గజ్వేల్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సీఎం అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పని ఉండాలని పని లేకుండా ఉన్నవాళ్లకు పని పుట్టించాలని కేసీఆర్ అన్నారు. పైరవీలు లేకుండా, పార్టీలు లేకుండా ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలపై చర్చిద్దామని కేసీఆర్ అన్నారు. 
 
ప్రతి మనిషికి హెల్త్ కార్డ్ ఉండేలా గజ్వేల్ నియోజకవర్గం నుండే హెల్త్ కార్డ్ లను ప్రారంభించేలా చర్యలు తీసుకోబోతున్నామని సీఎం అన్నారు. త్వరలో ఒకరోజంతా మీతోనే ఉంటానని సీఎం కేసీఆర్ అన్నారు. కరెంట్ బాధలు ఇక లేవని అన్నారు. 7,500 ఎకరాల అటవీ భూమిని వనమూలికల పార్క్ గా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. 
 
సిద్ధిపేట జిల్లా ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల భవనాలను 175 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈరోజు కార్యక్రమాలు పూర్తయిన తరువాత సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. గజ్వేల్ కు చెందిన ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి ఆయన భోజనం చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: