సాధారణంగా మంచి నీళ్ల బావి నుంచి మంచినీళ్లు బోరు నుంచి మంచి నీళ్లు వస్తుంటాయి.. అవి కొన్ని చోట్ల తియ్యగా, ఉప్పునీరు గా ఉండటం సహజం.  కానీ ఉత్తరప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లాలోని ఖాజోడి గ్రామంలో మంచి నీళ్లకు బదులు రక్తం రావడంతో అక్కడ ప్రజల గుండె గుభేల్ మంది.  వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లాలోని ఖాజోడి గ్రామంలో  కొంత కాలంగా తీవ్రమైన మంచినీటి కొరత ఉంటూ వచ్చింది.  ఆ ఊరిలో వంద మంది కుటుంబాలు నివసిస్తున్నారు.  పై అధికారులకు, నేతలకు తమకు మంచి నీటి సమస్య తీర్చాలని ఎప్పటి నుంచి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు.  మొత్తానికి వీరి మొర విన ప్రభుత్వం వారు ఓ  చేతిపంపును వేయించింది.  

 

అదృష్టం కొద్ది ఆ నీరు తీయగా ఉండటంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఇన్నాళ్లకు తమ మంచి నీటి కష్టం తీరిందిరా భగవంతుడా అనుకొని అందరూ అక్కడకు వచ్చి మంచినీటిని తీసుకొని వెళ్లడం ఆరంభించారు.  కానీ ఇప్పుడు ఆ మంచినీటి బోరు వద్దకు వెళ్లాలంటే గుండెలు చిక్కబట్టుకొని వెళ్లాల్సిన పరిస్థి వచ్చింది.  అసలు విషయం ఏంటేంటే ఇటీవలే మంచి నీళ్ల బోరు నుంచి రక్తం, మాంసం, ఎముకలు వస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సినిమాల్లో చూపించిన విధంగా కులాయి నుంచి రక్తం వస్తుంటుంది.. ఇది క్షుద్రశక్తులు, మాయగాళ్లు చేసే మంత్రం వల్ల అని చూపిస్తుంటారు.. కానీ ఇప్పుడు నిజంగానే ఆ చేతి పంపు నుంచి రక్తం రావడం అక్కడ ప్రజలను భయ భాంత్రులక గురి చేస్తుంది.

 

బోరు నుంచి రక్తం రావడాన్ని హమీర్‌పూర్‌ కలెక్టర్‌ దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే బోరును పరిశీలించిన అధికారులు లోపల ఎక్కడా రక్తపు ఆనవాళ్లు లేవని.. బహుషా ఏదైనా పాము హ్యాండ్‌ పంప్‌ లోకి వెళ్లడం వల్ల చనిపోయి ఆ రోజు రక్తం, ఎముకలు నుజ్జు నుజ్జు అయి మంసం వచ్చి ఉంటుందని అంటున్నారు. కానీ గ్రామస్థులు మాత్రం ఇదేదో ఊరికి కీడు సంకేతంగా భావిస్తున్నారు. బోరు వద్దకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.  అంతే కాదు ఆ హ్యాండ్ పంప్ నుంచి దుర్వాసన కూడా వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: