వెటర్నరీ డాక్టర్ దిశ ఘటనలో యావత్ ప్రజలు ఎంతగా స్పందించారంటే చెప్పలేము. వారి స్పందనను చూసిన చట్టం కూడా అంతే ఇదిగా స్పందించింది. ఇకపోతే దిశ మరణం పై పలువురు వివాదస్పద వాఖ్యలు చేసారు. మరికొంత మంది నీచులు, దరిద్రులు, ఆడవాళ్ల విలువ తెలియని అజ్ఞానులు నీచమైన కామెంట్స్ పెట్టారు. ఇకపోతే ఇప్పుడు మరో పెద్దావిడ ఈ సంఘటనపై స్పందించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

 

అవేమంటే తన తల్లిదండ్రులతో దిశ సఖ్యతగా లేదేమో అనిపిస్తుంది. నిందితులు అడ్డుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పే దైర్యం లేక దిశ తన చెల్లెలికి ఫోన్ చేసింది..  అదే ఆమె చెల్లెలికి కాకుండా తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకువెళ్లేవారు కదా! అని, నలుగురు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురై, ఆ తర్వాత పాశవికంగా పెట్రోల్ పోసి చంపబడ్డ దిశ పై కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ శోభ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

 

ఇదే కాకుండా అంతగా చదువుకుని, ఒక గెజిటెడ్ అధికారిగా ఉన్న దిశకు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదా అని ఆమె ప్రశ్నించారు. నిజ జీవితంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం మాత్రం ఎంతమందిని రక్షించగలదు. అందుకే దిశ ఘటనతో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఈ అవగాహన కార్యక్రమాల వల్ల ఒక్కరు మారిన చాలని ఆమె పేర్కొన్నారు.

 

 

ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, వాటన్నింటిని ప్రభుత్వంపై రుద్దడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిన్న జరిగిన మహిళా శిశు సంక్షేమ సంఘ సమావేశంలో ఆమె పైవిధంగా మాట్లాడారు. ఇకపోతే దిశ ఘటనపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కాగా ఈ వాఖ్యలపై కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. వ్యవస్దలో చట్టం ఉన్నది ప్రజలకు భద్రత కల్పించడానికే గాని సొంతపనులు చక్కబెట్టుకోవడానికి కాదని, ఇలాంటి విషయాల్లో మన ఇంట్లో మన అనుకున్న వాళ్లకు జరిగితే ఇలాగే స్పందిస్తారా అని జనం ప్రశ్నిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: