కంటి వెలుగు పథకం మాదిరిగా రాష్ట్ర ఆరోగ్య సూచీ తయారు చేయాలనేది తన కోరిక అని సీఎం కేసీఆర్ చెప్పారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందనిపేర్కొన్నారు. ఈ ప్రక్రియను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారుఈ సందర్భంగా గజ్వేల్‌‌లో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

 

గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో 7,500 ఎకరాల అటవీ భూమిని వనమూలికల పార్క్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. జనవరి చివరి నాటికి కాళేశ్వరం నీళ్లను గజ్వేల్‌కు తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులో గజ్వేల్ నుంచే హైదరాబాద్‌కు చేపల ఎగుమతి చేపడుతామన్నారు. నియోజకవర్గంలో పార్టీలు, పైరవీలు అనేది లేకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు.

 

హరితహారంలో గజ్వేల్ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.గజ్వేల్‌లో ఆరున్నర ఎకరాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం గజ్వేల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

 
అంతకుముందు ములుగులో నూతనంగా నిర్మించిన ఫారెస్టు కాలేజీ, పరిశోధనా కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు, విద్యార్థులతో మాట్లాడారు. ఏటా వందలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా దాదాపు రూ.175 కోట్ల వ్యయంతో ఈ కాలేజీ భవనాలను నిర్మించారు.

 

తమిళనాడులోని గట్టుపాలయం ఫారెస్ట్ కాలేజీ దేశంలోనే అధిక సంఖ్యలో 120 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులను అందించింది. అంతకంటే ఎక్కువ మంది ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తయారు చేసేందుకు వీలుగా ములుగులో ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కాలేజీని పూర్తి స్థాయి లేదా డీమ్డ్ యూనివర్సిటీగా  మార్చాడనికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: