నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలో తెలుగుదేశంపార్టీ నేత కె. మురళీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోరుకున్న ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.  అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు, మంత్రులతో దిగిన ఫొటోలను చూపించి అమాయకులను రెడ్డి మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.

 

నిరుద్యోగులను మోసం చేయటంలో రెడ్డి పెద్ద నెట్ వర్కును ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కడప, అనంతపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలోనే నిరుద్యోగులను రెడ్డి బుట్టలో వేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు జిల్లాల్లోని అధికారుల దగ్గరకు మంత్రుల సిఫారసుతో తరచూ కలుస్తు తనకు చాలా పలుకుబడి ఉన్నట్లు కలరింగ్ ఇస్తుండే వాడట.

 

అధికార యంత్రాంగంతో రాసుకుపూసుకుని తిరగటం, ప్రజాప్రతినిధులతో ఫొటోలు దిగటంతో పాటు చంద్రబాబుతో కలుసున్న ఫొటోలను చూపిస్తుండటంతో చాలామంది అమాయకులు నమ్మేశారట. దాంతో వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి లక్షల్లో వసూలు చేశారు.

 

డబ్బులు ఇచ్చి ఎంత కాలమైనా తమకు ఉద్యోగాలు రాకపోవటంతో నిరుద్యోగులు రెడ్డి వెంటపడటం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళకు ఏదో మాయమాటలు చెప్పి నెట్టుకొచ్చారు. ఇంతలో  ఎన్నికలు రావటంతో అదే విషయాన్ని నిరుద్యోగులకు చెప్పి కొంతకాలం నెట్టుకొచ్చారు.

 

అయితే ఎన్నికల్లో టిడిపి బోల్తా పడటంతో పాటు జిల్లాలోని తనకు సన్నిహితంగా ఉన్న ఫొటోల్లోని ప్రజాప్రతినిధులందరూ ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుండి నిరుద్యోగులు వెంటపడటం మరింత పెరిగిపోయింది. దాంతో అందరికీ మొహం చాటేశారు. చివరకు వారి నుండి తప్పించుకు తిరుగుతున్నారు.

 

తాము మోసపోయామని గ్రహించిన బాధితులు కల్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గట్టిగా పనిచేయటంతో మొత్తానికి రెడ్డిని అరెస్టు అయ్యాడు. నిరుద్యోగులకు డబ్బులు ఎలా అవుతుందో చూడాలి. అధికారంలో ఉండగా నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాట మాడిన తెలుగుదేశంపార్టీ నేతలు, బ్రోకర్ల జాతకాలు ఇంకెన్ని బయటపడతాయో చూడాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: