భారత దేశానికీ స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయినా  ఇంకా భారతదేశంలో చాలామంది ప్రజలు  పేదరికాన్నిఅనుభవిస్తూనే ఉన్నారు ,ఈ పేదరికాన్ని రూపుమాపడం,స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి, నల్ల ధనాన్ని తిరిగి తీసుకురావడం అనేది కలలో కూడా జరగదు.ఈ విషయము  మనకు అందరికీ తెలిసిందే. రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థం వల్ల దేశం ఇంకా ఆర్థిక సమస్యలను ఎదుర్కో వలసి వస్తున్నది. దీనితో తో ఇంకా మన  దేశం  వందేళ్ల వెనక్కేఉందనే సంగతి ఇలాంటి ఘటనలను చూస్తేనే మనకు అర్థమయి పోతుంది.

 

 మనిషకి కనీస అవసరాలైన  కూడు, గూడుకు నోచుకోని ప్రజలు దేశంలో కనీసం కొన్ని కోట్లల్లో ఉంటారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ వృద్ధురాలు  యొక్క జీవితము కూడా ఆ కోవకు చెందినటు వంటిదే.ఒడిశాలోని మయూర్భాంజ్అనే నే  గ్రామానికి చెందినటు వంటి 72 ఏళ్ల వయసు ఉన్నటువంటి ద్రౌపతి బెహరా అనే గిరిజన మహిళ.. గత మూడు సంవత్సరముల నుండి టాయిలెట్‌లోనే నివసిస్తోంది. టాయిలెట్ యే ఆమె నివాస భవనం .

 

సొంతవారు ఎవరూ లేకపోవడంతో అందులోనే ఒంటరిగా దుర్భర జీవితము అనుభవిస్తున్నది. అందులోనే వంట చేసుకుంటున్నది. అందులోనే నిద్రపోతూ దయనీయ జీవితం గడుపుతోంది.ఆ అవ్వ దీనావస్థను చూసి కనీసం ఆదుకొనేవారు కూడా లేకుండా పోవడము దురదృష్టకరం. గ్రామస్తులు, బంధువులు ఆమెను అనాథగా, ఒంటరిగా వదిలేశారు.

 

సోషల్ మీడియా ఆమె గురించి ఆ గ్రామ సర్పంచి బుధురాం పుటిని ప్రశ్నించగా.. ఆమెకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు తనకు అధికారం లేదని తన అశక్తతను వెలిబుచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆమెకు ఇల్లు మంజురైతే మాత్రమే సాయం చేయగలమని చెప్పారు. దానిని కట్టించి ఆమెకు ఇవ్వడానికి నాకు అధికారం లేదని మీడియాకు తెలిపారు పాపం.. ఆ అవ్వ ఇంకా ఎన్నాళ్లు దుర్భర పరిస్థితుల్లో జీవించాలి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: