వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చంద్రబాబు ఇంగ్లీష్ పై సెటైర్లు వేస్తూ ఆంగ్ల భాష మాధ్యమం యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో చెప్పారు.

చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చారని, వాళ్ళ వియ్యంకుడుకి విద్యాశాఖమంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. కొన్ని వందల ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు స్కూళ్లకు చంద్రబాబు పర్మిషన్ లు ఇచ్చాడు కానీ ఒక్క తెలుగు మీడియం ప్రైవేటు స్కూల్ కు కూడా అనుమతి ఇవ్వలేదని చెవిరెడ్డి అన్నారు. ఒక్క ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులకు కూడా తెలుగు మీడియం పాఠశాలలను పెట్టుకోమని చంద్రబాబు చెప్పలేదని సభాముఖంగా చెవిరెడ్డి అన్నారు.


తెలుగు మీడియం స్కూలు పెడితే మూత పడతాయని, పిల్లల చేరరని,  చంద్రబాబు కు లాభాలు రావని అందుకే తెలుగు మీడియం పాఠశాలలకు అనుమతి ఇవ్వలేదని చెవిరెడ్డి అన్నారు. కేవలం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలనే ప్రోత్సహించారని.. తెలుగు భాషా సంరక్షణ కోసం అతని ప్రభుత్వ హయాంలో ఏం పట్టించుకోలేదని చంద్రబాబుని విమర్శించాడు. అప్పుడు తెలుగు బాషా గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మాత్రం జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చారన్న నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. 


ఆ తర్వాత నోటుకు ఓటు కేసు గురించి ప్రస్తావించారు. అలాగే చంద్రబాబు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణ గురించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. ఆ సంభాషణలో చంద్రబాబు ఫోన్ మాట్లాడుతూ.. 'మన వాళ్లు బ్రిఫ్డ్ మీ' అని అన్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... 'ఆ ఫోన్ సంభాషణలో మాట్లాడినది తాను కాదని.. చంద్రబాబు నాయుడు అన్నారు' అని చెప్పుకొచ్చారు. మరి ఆ మాట్లాడింది ఎవరని కేటీఆర్ ని ఆయన అడిగినప్పుడు 'ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇంగ్లీష్ చంద్రబాబు తప్ప ఇంకెవరు మాట్లాడారు' అని కేటీఆర్ చెప్పారని గుర్తు చేసారు చెవిరెడ్డి. 



ఆ తర్వాత... ముఖ్యమంత్రి గా పాలించిన చంద్రబాబు వచ్చీ రాని సగం ఇంగ్లీష్, సగం తెలుగు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం పోగొట్టారని చంద్రబాబు ఇంగ్లీష్ ని ఎద్దేవా చేసారు. చివరిగా... ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తుతో చలగాటం ఆడొద్దని చంద్రబాబు నాయుడుకి పరోక్ష హెచ్చరిక చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: