గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారు అన్న విషయానికి వస్తే..


 
గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గజ్వేల్ లో ఇల్లులేని నిరుపేద కుటుంబం ఉండవద్దు. గజ్వేల్ ను మొత్తం ఎక్స్ రే తీసి ప్రణాళికతో ముందుకు పోదాం. జవనరి చివరి నాటికి కాళేశ్వరం నీళ్లు గజ్వేల్ కు వస్తాయి. జనవరిలో జలాల పండుగ చేసుకుందాం. ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి. స్వయం సమృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్దాం. త్వరలోనే గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశమవుతా. అందరిని కలుపుకొని పోతా. పార్టీలతో సంబంధం లేదు.

 

గజ్వేల్ ఎక్స్ రే రిపోర్టు అంటే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఎవరెవరికి ఏం కావాలి, ఇండ్లు లేని వారు ఎంత మంది, ఉపాధి కావాల్సిన వారెంత మంది అని డేటా తీయడం. గజ్వేల్ నియోజకవర్గం అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తాము అని తెలియచేయడం జరిగింది.

 

ఆ డేటా ఆధారంగా వారికి వసతులు కల్పించాలి. ఇండ్లు లేని వారందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం. ఇక్కడ పైరవీలు లేవు, పార్టీలు లేవు. అందరికి న్యాయంగా ఇస్తాం. అదే విధంగా రాష్ట్రమంతా హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. దీనిని గజ్వేల్ నుంచే ప్రారంభిస్తాం. హెల్త్ కార్డులో ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం ఉంటది. వారి బ్లడ్ గ్రూప్, ఇతర రోగాల వివరాలన్ని పొందుపరుస్తాం. ఉదాహరణకు గజ్వేల్ పిల్లగాడు హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో గాయపడితే ఆస్పత్రిలో అతని సెల్ నంబర్ కొడితే అతని డాటా మొత్తం బయటపడుతది. దాంతో వైద్యులు సులువుగా చికిత్స చేసి ప్రాణం కాపాడగలుగుతారు. దీనిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం."  అని సీఎం కేసీఆర్ తెలియచేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: