దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒక చోటనుంచి ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తున్నది.  హైదరాబాద్ లో దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమెను తగలబెట్టిన సంగతి తెలిసిందే.  దీంతో ఆ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  కానీ, ఈ ఎన్ కౌంటర్ తరువాత కూడా అత్యాచారాలు ఆగడం లేదు.  


పైగా పెరిగిపోతున్నాయి.  వరసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు.  ఇక ఇదిలా ఉంటె,  కామాంధులు  చిన్న పిల్లలను, మహిళలనే కాదు... చివరకు పురుషులకు కూడా కామాంధులు వదలడం లేదు.  అవును ఇది నిజం.  పురుషులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి.  ఇటీవలే ఓ 22 ఏళ్ల పురుషుడిపై నలుగురు అత్యాచారం చేశారు.  


మాములుగా ఆడపిల్లలపై జరిగే రేప్ లు బయటకు వస్తుంటాయి.  కానీ, పురుషుడిపై జరిగే అత్యాచారాలు మాత్రం అసలు బయటకు రావు.  ఎందుకంటే పురుషుడిపై అత్యాచారం జరిగింది అని పోలీసు కేసు పెట్టడానికి కూడా మొదట భయపడతారు.  సమాజం వారిని వేలెత్తి చూపిస్తుందేమో అని ఇబ్బంది పడతారు.  దేశ ఆర్ధిక రాజధానిగా పేరు తెచ్చుకున్న ముంబై నగరంలో 22 సంవత్సరాల యువకుడిని నలుగురు కామాంధులు అత్యాచారం చేశారు. 


ఇటీవలే ఈ యువకుడు ఓ సెల్ఫీ దిగి దానిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  అతడి ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతున్న ఓ నలుగురు కామాంధులు ఆ యువకుడిని వెతుక్కుంటూ వచ్చారు.  కారులో వచ్చి పరిచయం చేసుకున్నారు.  ఇంస్టాగ్రామ్ లో రెగ్యులర్ ఫాలో చేస్తుంటామని మాటలు కలిపి సరదాగా మాట్లాడుకుందామని చెప్పి కారులో బయటకు తీసుకెళ్లి నలుగురు కామాందుకు యువకుడిపై అత్యాచారం చేశారు,  అనంతరం ఆ యువకుడు తేరుకొని పోలీసులకు కంప్లైంట్ చేశారు.  నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: