దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఒకటి. ఇప్పటికే దీనికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా... కేంద్రం మాత్రం పట్టుదలతో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఇంతకీ పౌరసత్వ సవరణ బిల్లు ఏం చెబుతోంది..? విపక్షాల వాదనలేంటీ..?


 
భారత్‌, పాక్‌ విడిపోయాక... 1955లో పౌరసత్వం చట్టం చేశారు. దేశంలోని పౌరులందరికీ పౌరసత్వం కల్పిస్తుందీ చట్టం. ఇప్పటి వరకూ నాలుగుసార్లు సవరణలు చేశారు. అయితే.. ఎప్పుడూ వివాదం జరుగలేదు. ఈ సారి మాత్రమే రచ్చ అవుతుంది. 1955 పౌరసత్వ చట్ట సవరణలు చేసేందుకు కేంద్రం ఈ బిల్లు తెచ్చింది. ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశ్యం.. సరిహద్దు దేశాల నుంచి వచ్చిన మైనార్టీ శరణార్థులకు పౌరసత్వం కల్పించడం. ఇందులో ముస్లింల ప్రస్థావన లేకపోవడం వివాదానికి దారి తీసింది.

 

తమ దేశాల్లో రక్షణ లేదు. ఆశ్రయం కల్పించాలంటూ.. బంగ్లా, పాక్‌, ఆఫ్గాన్‌ నుంచి మైనార్టీలు పెద్ద సంఖ్యలో వలసొచ్చారు. కొన్నేళ్లుగా వారు శరణార్థులుగా ఉంటున్నారు. వారికి మాత్రమే పౌరసత్వం కల్పించేందుకు సవరణలు చేసింది కేంద్రం. అంతేకాని ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్రం వాదన. 

 

ముస్లిమేతర  శరణార్దులు అంటే హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు మాత్రమే ఈ బిల్లు ద్వారా పౌరసత్వం వర్తిస్తుంది. వరుసగా ఆరేళ్లుంటే భారత్‌లో ఉంటే చాలు.. పౌరసత్వం లభిస్తుంది. 2014 డిసెంబర్ 31లోపు భారత్‌కు వచ్చిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆరో షెడ్యూల్‌లో ఉన్న ప్రాంతాలకు ఈ బిల్లు వర్తించదు. 

 

ఈ బిల్లు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విపక్షం ఆరోపణ. ఆర్టికల్ 14 హక్కులను ఈ బిల్లు కాలరాస్తుందని, మత ప్రాతిపదికన శరణార్ధులను విభజించడంపై అభ్యంతరాలు చెబుతోంది. ముస్లింలను టార్గెట్‌ చేసుకుని సవరణ బిల్లు తెచ్చారని విమర్శలు చేస్తోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: