రాయలసీమలోలాగా .. దాహం వేస్తే ఆకాశం వైపు.. ఆకలి వేస్తే భూమి వైపు చూసే కరువు ప్రాంతం అంత కాదు కానీ  కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల ప్రాంతం మెట్ట ప్రాంతంగానే నీటి కి ఇబ్బంది గానే ఉండేది. వానలు పడితేనే పంటలు పండించుకునే అవకాశం ఉండేది . కానీ ఒకే ఒక్క ప్రాజెక్టు ఇప్పడు సిరిసిల్ల  ప్రాంత ప్రజల కరువు తీర్చింది. ఆ పని శ్రీకారం చుంటినది ఎవరో   కాదు .. సిరిసిల్ల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కేటీఆర్..సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచినా తర్వాత ఇక్కడ దారిద్య్రాన్ని పారద్రోలే ప్రయత్నం చేస్తున్నారు  . నేతలన్నల ఆకలి చావులను ఆపడానికి  వారికి బతుకమ్మ చీరలు సహా ప్రభుత్వ కాంట్రాక్టులు వచ్చేలా చేస్తున్నారు.

 

ఇక అంతేనా మెట్టప్రాంతం వల్ల నీటి జాడలు తక్కువగా ఉన్న సిరిసిల్ల జిల్లాకు కేటీఆర్ భగీరథ ప్రయత్నం మంచి ఫలితాలనే ఇచ్చింది. అని చెప్పొచ్చు  మానేరు వాగుపై కాళేశ్వరానికి గుండె వంటిది  అయిన మిడ్ మానేరు ప్రాజెక్టు ను టీఆర్ఎస్ సర్కారు కట్టింది. సిరిసిల్లలోనే ఈ ప్రాజెక్టును కట్టించడంలో నిర్వాసితులను ఒప్పించడంలో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు లో మొత్తం 25 టీఎంసీలు నింపుతున్నారు. ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దాదాపు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం వరకూ వచ్చాయి. కరువుతో ఎప్పుడు ఇబ్బంది పడే  సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పుడు నీటి జాడలు చూసి సిరిసిల్ల ప్రజలు అనడం తో పరవశించి పోతున్నారు  కేటీర్ ఫై  పొగడ్తల  వర్షం కురిపిస్తున్నారు .

 

కరువు ప్రాంతానికి నీళ్లను ఎదురెక్కించిన కేటీఆర్ కేసీఆర్ ల సంకల్పానికి నిదర్శనంగా తాజాగా కేటీఆర్ ట్విట్టర్ ఖాతా లో సిరిసిల్ల వాసులు ఫొటోలు షేర్ చేసి హల్ చల్ చేస్తున్నారు. కేటీఆర్ కు  ఈ విదంగా కృతజ్ఞత.లు సిరిసిల్ల ప్రజలు తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: