జగన్ వచ్చాక రాష్ట్రంలో రూల్ మారింది రూలింగ్ మారింది. అసాధ్యమనుకున్న ఎన్నో విషయాలను చాలా సులువుగా సుసాధ్యం చేస్తున్న ఏపీ నూతన ముఖ్యమంత్రి ఇప్పుడు క్యాబినెట్ లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు కొత్త బిల్లుకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా సవరణ చట్టం 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ ఆఫెన్సేస్ అగైనేస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019 బిల్లుపై బుధవారం చాలా దీర్ఘకాలం చర్చించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

ఇదే బిల్లు గనుక చట్టంగా మారితే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మరో ఆలోచన లేకుండా మరణశిక్ష విధిస్తారు. తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ మాదిరిగా కాకుండా ఇందులో అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు కనుక లభ్యం అయితే 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టం లో కొత్త మార్పులు తీసుకుని వస్తున్నారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి మరొక 14 రోజుల్లో విచారణ ఎట్టి పరిస్థితుల్లో జరపాల్సి ఉంటుంది. అంటే మొత్తం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు చేయాల్సి ఉండగా అంతకు ముందు దీని గడువు నాలుగు నెలలుగా ఉండడం విశేషం.

 

ఇప్పుడు ఆ విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ కొత్త బిల్లు రాబోతోంది. అంతే కాకుండా మహిళలు మరియు చిన్నారులపై నేరాల విచారణకు జిల్లా వారీగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

 

ఇక ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను జగన్ ఎలాంటి బెరుకూ లేకుండా తీసుకోవడం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు పెద్ద తల నొప్పిలా మారింది. మూస చట్టాలను ఇంకా వారి ప్రభుత్వం పాటించనుండడం మరియు జగన్ ఊపు ఇప్పుడు కేసిఆర్ పై తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి.

 

అలాగే సంబంధిత చట్టంలో తాజాగా చేస్తున్న మార్పుల ప్రకారం మెయిల్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే సెక్షన్‌ 354 (ఇ) కింద మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు.
పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు. పోక్సో చట్టం కింద ఇప్పటి వరకు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తుండగా దాన్ని మరింత పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: