ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రెస్ మీట్లు అన్నా ప్రచారం అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టకపోయినా అంతర్జాతీయ స్థాయి అమరావతి అంటూ ప్రెస్ మీట్ల ద్వారా ఊదరగొట్టిన ఘనత చంద్రబాబుది. ఐదేళ్ల తెలుగుదేశం పాలనను ప్రజలు ఛీత్కరించుకున్నా చంద్రబాబు మాత్రం ఏం మారలేదు. ఇప్పటికీ చంద్రబాబు పలు సందర్భాల్లో హైదరాబాద్ నగరాన్ని తానే అభివృద్ధి చేశానని ప్రముఖ ఐటీ కంపెనీలు తన వలనే హైదరాబాద్ కు వచ్చాయని చెబుతున్న విషయం తెలిసిందే. 
 
ఈరోజు చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం నుండి ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ కేజీ ఉల్లి కోసం ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ఆర్టీసీ రేట్లను ఇష్టానుసారంగా పెంచేశారని అన్నారు. గతంలో ప్రతిపక్షానికి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ప్రభుత్వం ఎక్కువ అవకాశాలు ఇచ్చిందని అన్నారు. స్పీకర్ వైఖరి సరిగా లేదని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సభలో చర్చించాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు. 
 
ఎన్టీయార్ రాయలసీమకు నీళ్లివ్వాలని సంకల్పించారని హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు - నగరికి శ్రీకారం చుట్టారని మా హయాంలో ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాయని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కృషి వలనే కియా మోటార్స్ వచ్చిందని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు ద్రోహం చేశారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు ప్రాజెక్టులు అవసరం లేదని అన్నారని చంద్రబాబు చెప్పారు. 
 
గ్రామ సచివాలయ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలపై ప్రజలు రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా చంద్రబాబు చేసి ఉంటే అంత ఘోరంగా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయావని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు తీరు ఏమీ మారలేదని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ చంద్రబాబు ప్రెస్ మీట్లలో కూడా గొప్పలు చెప్పుకుంటున్నాడని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: