సోమవారం  తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌  యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.  ముందుగానే  గవర్నర్ యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా,  ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా యాదాద్రి కి  వెళ్లాలని నిర్ణయంచుకున్నట్లు సమాచారం.  ఉదయం  యాదాద్రి కొండపైకి చేరుకున్న గవర్నర్‌ తమిళిసై దంపతులు  బాలాలయానికి చేరుకున్నారు.యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారాంచంద్రన్,  భువనగిరి ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘన స్వాగతం ఫలికారు.  ఇందులో సంబంధిత ఎమ్మెల్యే హాజరు కాకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. తదనంతరం బాలాలయం ప్రధాన ద్వారం వద్ద ఆలయ ఆచార్యులు పూర్ణకుంభంతో సంప్రదాయపద్దతిలో  వారికి స్వాగతం పలికారు.గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అనుకున్న సమయానికి ఆలయానికి రాలేదు. గవర్నర్‌ దంపతులు క్షేత్రంలోకి వెళ్తున్న సమయంలో ఐదు నిమిషాలు ఆలస్యంగా విప్‌ సునిత వచ్చారు.  అనంతరం మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ గీతారెడ్డి, ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామివారి  లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్‌ దంపతులకు అందజేశారు.  అనుకున్న సమయానికి రాలేకపోయిన విప్ సునీత గవర్నర్‌ను కలిసేందుకు వెళ్తున్న తొందరలో  తన కాళ్లకు ధరించిన షూ తోనే మెట్లు ఎక్కడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఎలా షూ ధరించి మెట్లెక్కడం చుసిన భక్తులు ఎమ్మెల్యే కాబట్టి అలా ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేసారు.  విషయం చర్చనీయాంశం అవ్వడం వల్ల ఎమ్మెల్యే స్పందించారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ వచ్చిన హడావుడిలో అనుకోకుండా షూతో ఐదు మెట్లు ఎక్కానని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలని షూతో మెట్లు ఎక్కలేదని తెలిపారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: