మనము చూస్తుంటాం.. భూమి గుంతలు పడటం. రోడ్డుపై వాహనంలో వెళ్తున్న సమయంలో బరువు ఎక్కువ అవుతే హఠాత్తుగా భూమి కుంగిపోతుంది. భారీ గుంతలు పడుతుంటాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరి దారుణంగా పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోతుంటుంది. అయితే ఇలా భూమి కుంగిపోవటం వంటి ఘటనలు అన్ని ఎక్కువగా వర్షాకాలంలో జరుగుతుంటాయి. 

                            

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే రక్తం ఉడికిపోతుంది!! 

 

అయితే వాటిని పరిశీలించిన భూగర్భ శాస్త్రవేత్తలు.. భూమి కింది భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని నివేదిక ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కుంగిపోయి గుంతలు పడింది. బ్రెజిల్‌ రాజధాని అయిన బ్రెసీలియాలో కార్లు పార్క్‌ చేసి ఉన్న ప్రాంతంలో ఒక్క ఉదుటున భూమి కుంగిపోయింది. 

 

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులు ఎంత అదృష్టవంతులో !!

 

ఆ ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది. దీంతో నాలుగు కార్లు అందులో పడిపోయాయి. ఓ భవనానికి కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అక్కడ ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని భూమి ఆలా ఎందుకు కుంగిపోయిందో తెలుసుకోడానికి పరిశోధనలు చేస్తున్నారు. కాగా మన రాష్ట్రంలో భూమి కుంగిపోవడం మాములే కానీ మరి ఇంత దారుణంగా కుంగి పోవడం ఇక్కడే చూస్తున్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: