త‌న‌దైన శైలిలో రాజ‌కీయం చేయ‌డం, నిర్ణ‌యాలు వెలువ‌రించ‌డం, ప‌థాకాలు ప్ర‌వేశ‌పెట్ట‌డంలో పాపుల‌ర్ అయిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మ‌రో ముద్ర వేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ ద‌ఫా త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఆ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం ప్రారంభించ‌నున్నారు. కంటి వెలుగు పేరుతో ప్ర‌తిష్టాత్మ‌క ప‌థకం ప్రారంభించిన కేసీఆర్ అలాంటిదే మ‌రో ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. దానికి త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన గజ్వేల్‌ను కేంద్రంగా చేసుకున్నారు. దేశం చూపు గ‌జ్వేల్‌పై ప‌డేలా...త‌న అడుగులు ఉంటాయ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. 

 

కేసీఆర్‌కు కొత్త రోగం..దాని పేరెంటో డాక్ట‌ర్లే చెప్పాలి 


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త‌న సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ప‌ర్య‌టించారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ...ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా.. ఇప్పుడు అందరూ మనవాళ్లే. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది. ఆదర్శం ఉంటే అధికారులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  గజ్వేల్‌లో ప్రతీ మనిషికి చేతినిండా పని ఉండాలి. ప్రతీ ఇల్లు పాడి పరిశ్రమలో కళకళలాడాలి. నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. 
గజ్వేల్‌ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో అడవి విస్తరించింది. మల్లన్నసాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. పతీ చెరువు, కుంట నిండి పంటలు పండినప్పుడే నిజమైన సంతోషం వస్తుంది. దేశమే ఆశ్చర్యపోయే విధంగా గజ్వేల్‌లో అడవులను పునరుద్ధరిస్తున్నాం. గజ్వేల్‌ను పచ్చగా చేయాలనుకున్నాం. చేసి చూపించాం.`` ` అని ప్ర‌క‌టించారు.

 

దిశకు కుటుంబానికి స‌రైన సంబంధాలు లేదు...టీఆర్ఎస్ నేత సంచ‌ల‌న కామెంట్‌


కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ``అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ ఉంటుంది.హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి.  హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రక్రియను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరుతున్నాను` అని సీఎం కేసీఆర్ తెలిపారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి వచ్చే ఏడాది జనవరి నెలఖారు నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని భ‌రోసా ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: