వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్, మంత్రులు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఏదొకవిధంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఉండరు. అయితే వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసే క్రమంలో పవన్...ప్రత్యేకంగా మంత్రి కన్నబాబుని లక్ష్యంగా చేసుకుని ఎక్కువ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏదొక సమయంలో మంత్రిని ఇబ్బంది పెట్టె విధంగా మాట్లాడుతూ వచ్చారు. అయితే మంత్రి కూడా ఏ మాత్రం తగ్గకుండా పవన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు.

 

ఇలా పవన్...కన్నబాబుని టార్గెట్ చేయడానికి కారణం ఏంటో అందరికి తెలుసు. కన్నబాబు 2009లో ప్రజారాజ్యం ద్వారానే రాజకీయ అరంగ్రేటం చేశారు. అప్పుడు ఆయన కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇలా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా కన్నబాబు వెనుక ఉండి ప్రేరేపించారని పవన్ ఓ నెగిటివ్ ఆలోచన మైండ్ లో పెట్టేసుకున్నారు. పైగా తాను జనసేన పెట్టిన కన్నబాబు పార్టీలోకి రాలేదు.

 

ఈ మొత్తం కారణాలతో 2019లో కన్నబాబుని ఓడించాలని పవన్ ఎక్కువ ప్రచారం చేశారు. కానీ అది  కుదరలేదు. కన్నబాబు గెలిచేశారు. మంత్రి కూడా అయిపోయారు. ఇక పవన్ పరిస్తితి ఏమైందో అందరికి తెలిసిందే, అయిన పవన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కన్నబాబుపై మాటలు తుటాలు పేలుస్తూనే ఉన్నారు. ఆయన్ని ఎక్కడక్కడ ఇబ్బంది పెట్టాలనే చూశారు. ఈ క్రమంలోనే కన్నబాబు టార్గెట్ గా పవన్ మరో అస్త్రంతో ముందుకొచ్చారు. రైతుల సమస్యల కోసమని చెబుతూ కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష పేరిట పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు.

 

కన్నబాబు ఎలాగో వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి రైతుల సమస్యలపై కాకినాడలోనే పోరాటం చేస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టొచ్చని పవన్ వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రైతులకు పెద్ద పీఠ వేసి అనేక కార్యక్రమాలు చేసింది. మరి ఇలాంటి తరుణంలో పవన్ దీక్ష సక్సెస్ అయ్యి...కన్నబాబుని ఏ మాత్రం ఇబ్బంది పెడతారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: