ప్రజా సేవ చేయడానికి పదవే అక్కర్లేదని ఓ వైసీపీ నేత నిరూపిస్తున్నారు. ఎమ్మెల్యే పట్టించుకుపోయిన తానే అన్ని పనులు దగ్గర ఉండి చూసుకుంటూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నారు. దీంతో ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనే తమకు ఎమ్మెల్యే అని అక్కడి ప్రజలు గట్టిగానే చెబుతున్నారు. ఇలా ఓడిపోయినా...ప్రజల్లో ఎమ్మెల్యే అనిపించుకుంటున్న నేత ఎవరో కాదు.... విశాఖ ఉత్తర ఇన్-చార్జ్ కేకే రాజు. మొన్న ఎన్నికల్లో ఈయన గంటా శ్రీనివాసరావు పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

 

అయితే గంటా గెలిచిన దగ్గర నుంచి పార్టీ మారిపోతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఇంకా పార్టీ లేదు కానీ...ఎమ్మెల్యేగా అయితే యాక్టివ్ గా లేరు. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయాయి. కావాలని గెలిపించుకున్న...గంటా ప్రజలని పట్టించుకోవడం మానేశారు. దీంతో కేకే రాజునే ప్రజలకు అండగా నిలవడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న పరిష్కరించడంలో ముందుంటున్నారు.

 

సీఎం జగన్ అండతో ఇప్పటికే నియోజకవర్గంలో పలు సమస్యలని పరిష్కరించారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అధికారులతో సమీక్షలు చేస్తూ అభివృధ్ధి చేస్తున్నారు. ఇక అధికారులు కూడా ఈయన మాట వింటున్నారు. అటు విజయసాయిరెడ్డి సపోర్ట్ కూడా ఫుల్ గా ఉండటంతో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి అనధికార ఎమ్మెల్యేగా మారిపోయారు. అటు ప్రజలు కూడా ఈయనే మాకు ఎమ్మెల్యే అనే విధంగా నడుచుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

 

ఇక ఆయన పుట్టినరోజుకు వైసీపీ నేతలు నగరమంతా సందడి చేశారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీని బట్టి చూసుకుంటే విశాఖ ఉత్తరానికి ఈయనే ఎమ్మెల్యే అన్నట్లు ఉంది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. గంటా వైసీపీలోకి వస్తే పరిస్తితులు తారుమారయ్యే అవకాశం ఉంది. కాకపోతే గంటా వైసీపీలోకి రానంత కాలం కేకే రాజుకు తిరుగుండదు. ఏదేమైనా గెలిచిన గంటా క‌న్నా ఓడిన రాజే ఇప్పుడు అక్క‌డ ప్ర‌జ‌ల హీరో అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: