వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో రోజులు గడుస్తున్న కొద్దీ షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై ఒకవైపు కోర్టులు మరోవైపు మానవ హక్కుల సంఘం చాలా సీరియస్ అయ్యాయి. విచారణలో  మానవ హక్కువ సంఘం చాలా వేగంగా స్పందించింది. ఈ నేపధ్యంలోనే నలుగురు  నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న షాకింగ్ నిజం వెలుగు చూసింది.

 

ఎన్ కౌంటర్ ఘటనపై గడచిన మూడు రోజులుగా మానవహక్కుల సంఘం అనేక ప్రాంతాల్లో తిరుగుతూ విచారణ చేస్తోంది. తన విచారణలో భాగంగానే నిందితుల కుటుంబసభ్యులను కూడా కలిసింది. ఈ నేపధ్యంలో నలుగురు నిందుతులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించారు. పనిలో పనిగా నలుగురు వయస్సు ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించారు.

 

వయస్సు వివరాలను చూసినపుడు హక్కుల సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నలుగురిలో ముగ్గురు మైనర్లే అన్న విషయం బయటపడింది. ఇదే విషయమై కమీషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ నిందితుల్లో మైనర్లెవరు లేరని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవాలు చూసినపుడు సజ్జనార్ ప్రకటనకు విరుద్ధంగా ఉంది.

 

హక్కుల సంఘం విచారణలో భాగంగా నిందితులు చదివిన స్కూళ్ళల్లో తీసుకున్న బోనఫైడ్ సర్టిఫికేట్లను కుటుంబసభ్యులు చూపారు. బోనఫైడ్ సర్టిఫికేట్ల ప్రకారమైతే జొల్లు శివ వయసు 17 ఏళ్ళ  3 నెలల 21 రోజులు. కాగా రెండో నిందితులు చెన్న కేశవుల వయసు 15 సంవత్సరాల 7 నెలల 26 రోజులని తేలింది. చెన్న కేశవులుకు 15 ఏళ్ళకే వివాహం అవ్వటం భార్య గర్భవతవ్వటం మరింత ఆశ్చర్యంగా ఉంది.

 

అలాగే మూడో నిందితుడు జొల్లు నవీన్ 2004లోనే పుట్టాడు. సర్టిఫికేట్ ప్రకారం నవీన్  వయసు 14 ఏళ్ళ 10 నెలలు మాత్రమే అని తెలుసుకుని హక్కుల సంఘం షాకైపోయింది. అయితే ఆధార్ కార్డులో మాత్రం నవీన్ వయసు 18గా ఉంది.  ఎన్ కౌంటర్ అయిన నలుగురిలో ముగ్గురు మైనర్లే కావటంతో కేసు బాగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. మరి పోలీసులు ఎలా సమర్ధించుకుంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: