దాదాపు ఎకరం స్ధలంలో అత్యంత విశాలంగా మహారాజ భవనాలను తలదన్నే రీతిలో నిర్మిస్తున్న సువిశాల భవనం ఎవరిదో తెలుసా ? ఇంకెవరిది తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ దే. నాలుగు ముఖద్వారాలతో నిర్మితమవుతున్న ఈ విలాసవంతమైన భవనాన్ని ఈనెల 22వ తేదీన గృహప్రవేశం చేయాలని ముహూర్తం కూడా పెట్టుకున్నట్లు సమాచారం. కాకపోతే పనులు ఇంకా పూర్తవటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ముహూర్తాన్ని మార్చుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది.

 

కేసియార్ కు ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఓ ఇల్లుంది. అలాగే ఓ ఫాం హౌస్ కూడా ఉంది. అయితే ఫాం హౌస్ లోకి కేసియార్ అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించే ప్రశక్తే లేదన్న విషయం అందరికీ తెలుసు. కొత్త ఫాం హౌస్ ను కేసియార్ దగ్గరుండి మరీ నిర్మించుకుంటున్నారు.

 

దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్టులతో మాట్లాడి తన ఆలోచనలను పంచుకుని తన అభిరుచులకు తగ్గట్లుగా డిజైన్ చేయించిన తర్వాత కేసియార్ ఫాం హౌస్ నిర్మాణాన్ని ఆరంభించారు.  కొత్త ఫాం హౌస్ కి రాష్ట్రపతి,  ప్రధానమంత్రి స్ధాయి అత్యంత ప్రముఖులు వచ్చినా బస ఏర్పాట్లకు ఎటువంటి లోటు జరక్కుండా అన్నీ వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

 

ప్రముఖుల కోసం అవుట్ హౌస్ నిర్మిస్తున్నా ఇది కూడా సర్వాంగ సుందరంగానే ఉండబోతోందని తెలుస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న ఫాం హౌస్ లో  సమీక్షలు, సమావేశాల నిర్వహణకు సకల సౌకర్యాలతో  సువిశాలమైన నాలుగు హాళ్ళు ఉన్నట్లు సమాచారం.

 

కొత్త ఫాం హౌస్ లోకి అతిధులు ప్రవేశించటానికి వీలుగా నాలుగు ముఖద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ వాస్తు ప్రకారమే నిర్మిస్తున్నారు. ప్రతి ముఖద్వారాన్ని దేనికదే ప్రత్యేకమైన వాస్తు శిల్పితో నిర్మిస్తున్నారట. అత్యంత విశాలమైన రాజప్రాసాదానికి తగ్గట్లే అందులోని వస్తుసామగ్రిని కూడా అంతే స్ధాయిలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి గదిలోను యాంటిక్ పీసెస్ నే ఎంపిక చేస్తున్నారట.

 

అదే విధంగా కొత్తగా ఫాం హౌస్ ను సాంకేతికంగా కూడా బాగా ఉన్నతంగా ఏర్పాటు చేస్తున్నారు.  అవసరమైన సమయాల్లో  కుటుంబసభ్యుల ఫోన్లు తప్ప ఇతర ఫోన్లేవీ పనిచేయకుండా అత్యంత శక్తవంతమైన  జామర్లను ఏర్పాటు చేస్తున్నారట. మరి ఇంతటి మహారాజ ప్యాలెస్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది ? ఈ విషయాన్ని మాత్రం ఎవరికి వాళ్ళుగా వాళ్ళే అంచనా వేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: