గుడివాడ.... ఒకప్పుడు టీడీపీ కంచుకోట.... ఇప్పుడు కొడాలి నాని అడ్డా...ఇక్కడ నానినీ కదపాలంటే చాలా కష్టమని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడో అర్ధమైంది. రెండు సార్లు నానిని ఓడించాలని వ్యూహాలు రచించిన చంద్రబాబు వల్ల కాలేదు. అయితే ఇంత జరిగిన చంద్రబాబు మాత్రం నానినీ ఏదొక విధంగా నెగిటివ్ చేయాలనే ప్రయత్నాలు మానలేదు. ఆయన్ని ఎలా అయిన దెబ్బకొట్టాలని ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా నానినీ దెబ్బకొట్టే వ్యూహం రచించారు. ఇక చివరికి వ్యూహం కాస్త బెడిసికొట్టి చంద్రబాబు పరువే పోయింది.

 

అసలు ఆ ఘటన ఏంటి? చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన విష ప్రచారం ఏంటి? అనే దానిపై పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటీవల ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.25కే ఇస్తున్నారు. అయితే ఉల్లి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్యూ లైన్లలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ రైతు బజారుకు కూరగాయలు కొనుగోలు చేద్దామని వచ్చిన ఆర్టీసీ రైటైర్డ్ ఉద్యోగి గుండెపోటు వచ్చి అక్కడిక్కడే మరణించాడు.

 

ఈయన అసలు ఉల్లి లైన్ లొకే వెళ్లలేదు. అయినా సరే చంద్రబాబు భజన మీడియా ఉల్లి కోసమే ప్రాణాలు విడిచాడని ప్రచారం మొదలుపెట్టాయి. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని బాబు అండ్ బ్యాచ్... వైసీపీ ప్రభుత్వం, కొడాలి నానిపై విమర్శలు మొదలుపెట్టారు. దీంతో నాని అసెంబ్లీలోనే బాబు బ్యాచ్ కు చురకలు అంటించి...చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుడు మీడియాతో మాట్లాడినా వీడియోని అసెంబ్లీలో ప్లే చేసి చూపించారు. అసలు ఏదో వాకింగ్ వెళ్లొస్తూ...ఫ్రెష్ కూరగాయాలని కొనుగోలు చేద్దామని బజార్ కు వెళ్లరని, అసలు ఉల్లి కోసం కాదని చెప్పారు.

 

దీంతో బాబు అండ్ బ్యాచ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. బాబు ఇప్పటికైనా శవ రాజకీయాలు చేయడం మానేయాలని, ఇంకా ఎక్కడైనా రాజకీయం చేయగలరేమో గానీ...అది గుడివాడ అని, అక్కడ ఉండేది కొడాలి నాని అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇదే మాట గుడివాడ నియోజకవర్గ ప్రజలు కూడా చెబుతున్నారు. బాబు...నానినీ ఎంత బ్యాడ్ చేయాలని చూసిన అది ఆయనకే ప్లస్ అవుతుందని, అయినా నాని ఉన్నంతవరకు గుడివాడలో మరొకరు అడుగుపెట్టడం కష్టమని ఓపెన్ గానే చెబుతున్నారు. మొత్తానికి  నానినీ నెగిటివ్ చేద్దామనుకుని బాబు ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: