హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ పై జరిగిన అఘాయిత్యం గురించి అందరికి తెలిసిందే. ఈ కేసు లో నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపిన విషయం తెలిసిందే. దీనితో అందరూ పోలీసులపై హర్షం వ్యక్తం చేసారు. కానీ జాతీయ మానవ హక్కుల సంఘం దీనిపై విచారణ మొదలుపెట్టి ..అసలు ఎన్ కౌంటర్ ఎలా జరిగింది. ఎందుకు జరిగింది అని విచారించారు. అలాగే నిందుతుల తల్లిదండ్రులని దిశ తల్లిదండ్రులని కూడా వీరు విచారించారు. ఇక ఈ విచారణలో భాగంగా నిందితుల్లో ఇద్దరు మైనర్లని వాళ్ళ తల్లిదండ్రులు ఆధారాలు చూపించిన సంగతి కూడా తెలిసిందే.

 

ఐతే తాజాగా అయితే మూడో వ్యక్తి జొల్లు నవీన్ కుమార్ కూడా మైనరే అని వారి తల్లిదండ్రులు ఆధారాలు చూపించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. మంగళవారం అతని తల్లి బోనాఫైడ్ సర్టిఫికెట్ చూపించారు.అలాగే సోమవారం నిందితులు శివ చెన్నకేశవులు మైనర్లని వారి తల్లిదండ్రులు పాఠశాలలో ఇచ్చిన బోనాఫైడ్ సర్టిఫికెట్లు చూపించారు. దీనితో నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం నమోదు చేసింది. ఈ బోనాఫైడ్ సర్టిఫికెట్లు నిందితుల్లో ముగ్గురిని మైనర్లుగా చూపించడంతో ఎన్కౌంటర్ కేసు ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ఈ పత్రాల ప్రకారం ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ మినహా మిగిలిన ముగ్గురూ మైనర్లే అవుతున్నట్లు తెలుస్తోంది.

 

నలుగురిలో కెల్లా జొల్లు నవీన్ అత్యంత చిన్న వయసువాడని అతని బోనాఫైడ్ సర్టిఫికెట్ ని బట్టి తెలుస్తోంది. జొల్లు నవీన్ 2004 ఏప్రిల్ 4న జన్మించినట్లు ఉంది. ఈ లెక్కన ఎన్కౌంటర్ నాటికి నవీన్ వయసు 14 ఏళ్ల 10 నెలలు అవుతుంది. మరోవైపు జొల్లు నవీన్ ఆధార్కార్డులో అతని వయసు 18 ఏళ్లుగా ఉంది. బోనాఫైడ్ పత్రాల ప్రకారం.. నిందితులు జొల్లు శివ చింతకుంట చెన్నకేశవుల వయసు 18 ఏళ్లలోపే ఉంది. ఈ క్రమంలో ఎన్కౌంటర్ ఘటన జరిగిన రోజు నాటికి జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు కాగా చెన్నకేశవులు వయసు 15 ఏళ్ల 7 నెలల 26 రోజులు గా ఉంది. మరో విషయం ఏమిటంటే .. చెన్నకేశవుల కు ఇప్పటికే వివాహం కాగా అతడి భార్య ప్రస్తుతం గర్భవతి.  

మరింత సమాచారం తెలుసుకోండి: