ఊహించని మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆరు నెలలు దాటుతుంది. అయితే ఈ ఆరు నెలల్లో వైసీపీ స్టామినా తగ్గిందా? పెరిగిందా? అంటే పెరిగిందనే అనిపిస్తోంది. జగన్ అందిస్తున్న ప్రజారంజక పథకాలు, ప్రజలకు మేలు కోసం అమలు చేసే సరికొత్త నిర్ణయాలు, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు....ఇవన్నీ వైసీపీపై ప్రజలకు ఆదరణ పెరిగేలా చేశాయి. అయితే ఇదే సమయంలో ప్రతిపక్షాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని అనిపిస్తోంది. పనిగట్టుకుని జగన్ ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు చేస్తుండటం వల్ల ప్రజల్లో చులకన అయిపోతున్నారు.

 

అసలు జగన్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కనీసం సమయం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ వస్తున్నారు. పోనీ ఏదైనా ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక సూచనలు ఇస్తే జగన్ ప్రభుత్వం వాటిని పరిష్కరించడానికి చూస్తుంది. కానీ చంద్రబాబు, పవన్ లు మాత్రం అలా చేయడం లేదు. వెంటనే జగన్ని అధికారంలో నుంచి దించేసి...తాము అధికార పీఠం ఎక్కేయాలనే ఆతృతతో ఉన్నారు.

 

ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలేదు....కానీ ప్రతిదానికి ఏదొక పోరాటం అంటూ రోడ్లపైకి ఎక్కేస్తున్నారు. పవన్ ఇసుక కోసం లాంగ్ మార్చ్ పెడితే...బాబు ఇసుక పోరాటం అని పెట్టారు. ఇక అమరావతి పర్యటనకు వెళ్లి బాబు పెద్ద హడావిడే చేశారు. ఇక దేశమంతా ఉల్లి ధర పెరిగితే వీరిద్దరు మాత్రం జగన్ ని తిడతారు. ఇక తాజాగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని కొంచెం రేటు పెంచగానే బాబు బ్యాచ్ రోడ్లపై పడి గగ్గోలు పెట్టేస్తుంది. అటు జగన్ ప్రభుత్వం రైతులని అన్నీ విధాలా ఆదుకుంటే...పవన్ రైతు సౌభాగ్య దీక్ష అంటూ ఓ టెంట్ వేసుకుని మీడియా ముందు హడావిడి చేయడానికి సిద్ధమయ్యారు.

 

అయితే ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న ప్రజలు ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనే విషయం పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారు. జగన్ ఎంత మంచి చేసిన చంద్రబాబు, పవన్ లు పనికిమాలిన పోరాటాలు చేస్తున్నారంటూ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఒకవేళ మళ్ళీ ఎన్నికలోస్తే టీడీపీకి మొన్న వచ్చిన 23 సీట్లు కూడా రావని, పవన్ ముక్కి మూలిగి గెలుచుకున్న ఆ ఒక్క సీటు కూడా గల్లంతే అని అనుకుంటున్నారు. ఏదేమైనా ఏపీలో ప్రతిపక్షాలు పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: