ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంలో చాలా మందికి అసలు ఎప్పటికి అర్ధం కాని ప్రశ్నల్లో ఒకటి... నిర్ణయాలను ఎందుకు ఆయన ఆలస్యంగా తీసుకుంటారని... రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం ఉన్నా సరే చంద్రబాబు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఎన్ని సందర్భాల్లో పార్టీ ఇబ్బంది పడినా సరే ఆయన వైఖరిలో మాత్రం ఏ మార్పు రాలేదు అనేది వాస్తవం. రాజకీయంగా ఆ పార్టీ ఎన్ని విజయాలు సాధించిన సరే ఎక్కువగా నష్టపోయింది మాత్రం చంద్రబాబు ఆచితూచి, నిర్ణయాలను నెలల నెలల తరబడి పొడిగించడమే. 

 

ఒక పక్క ప్రత్యర్ధులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు మాత్రం వాటికి ఎక్కువ సమయం కేటాయించి ఇబ్బంది పెడుతూ ఉంటారు. వైఎస్ ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు వేగంగా ఉండేవి... రోజులు గంటల వ్యవధిలో పనులు అయిపోయేవి కాని చంద్రబాబు మాత్రం వాటికి సమీక్షలు అది ఇది అంటూ కాలయాపన చేసే వారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను తీర్చే అవకాశం ఉన్న సమయంలో కూడా వాళ్ళను బుజ్జగించాలి,

 

వీళ్ళకు న్యాయం చెయ్యాలి అంటూ పార్టీ నేతలకు చికాకు తెప్పిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయంగా ఒక పక్క బలహీనపడుతున్నా సరే చంద్రబాబు మాత్రం కొన్ని జిల్లాల అధ్యక్షుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో చికాకు పెడుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ ల విషయంలో ఆయన వైఖరి మారడం లేదు. 

 

యువకులకు అవకాశం ఇవ్వాలని ఎంత మంది సూచించినా సరే చంద్రబాబు మాత్రం మారడం లేదు. సీనియర్ నేతలు అలుగుతారు అంటూ వాళ్ళను బుజ్జగించే కార్యక్రమాలు నియోజకవర్గాలలో చేస్తున్నారు. దీనితో కొంత మంది ఇబ్బంది పడుతున్నారు. అస‌లు బాబు తీరు ఎప్ప‌ట‌కి మారుతుంది.. ఈ నాన్చుడు ఆయ‌న వ‌ద‌ల‌రా ? అని చాలా మంది గ‌గ్గోలు పెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: