40 ఏళ్ల రాజకీయ అనుభవం....14 ఏళ్ళు సీఎం...10 ఏళ్ళు ప్రతిపక్ష నేత...మళ్ళీ ఇప్పుడు ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు...ఇవే బాబు ఎప్పుడు మాట్లాడినా చెప్పుకునే డైలాగులు. అవును బాబు చెప్పే డైలాగులు నిజమే. ఆయనకు 40 ఏళ్ల అనుభవం ఉంది. 14 ఏళ్ళు సీఎంగా చేశారు. 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పైగా ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రధానమంత్రులని డిసైడ్ చేశారు. ఒకప్పుడు ఏపీని అభివృద్ధి చేశారు. కానీ ఒకప్పుడులా బాబు ఇప్పుడు లేరు. ఆయన వయసు పెరిగికొద్దే ఆయనకు విలువ పెరగాల్సింది పోయి....రోజురోజుకూ తగ్గిపోతూ వస్తుంది.

 

విలువ పడిపోవడం వల్ల ఆయన వైసీపీలో ఉండే జూనియర్ ఎమ్మెల్యేల ముందు కూడా తేలిపోతున్నారు. దీనికి ఉదాహరణే తాజా అసెంబ్లీ సమావేశాలు. ఆయన ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ప్రశ్నలు అడిగితే అధికార పక్షం నీళ్లు నమిలేది. కానీ ఇప్పుడు జూనియర్ ఎమ్మెల్యేలు వేసే సెటైర్లకు బాబు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఆయనకు అసలు ఏం మాట్లాడాలో తెలియక బిక్క మొహం పెట్టేస్తున్నారు.

 

మరి సెటైర్లు ఎక్కువ ఉంటే బరస్ట్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అసలు అసెంబ్లీలో చంద్రబాబుని జగన్ దగ్గర నుంచి మొదటి సారి ఎమ్మెల్యే అయిన వారు దాకా ఆడేసుకుంటున్నారు. సరే సీఎం విషయం పక్కనబెడితే తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన అప్పలరాజు, విడదల రజని, తాడికొండ శ్రీదేవి, జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీ చరణ్ లాంటి వారు బాబుపై విరుచుకుపడుతుంటే ఆయన దగ్గర నుంచి సౌండ్ ఉండటం లేదు.

 

ఇక రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు లాంటి వారైతే బాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఆఖరికి టీడీపీ నుంచి బయటకొచ్చిన వల్లభనేని వంశీ కూడా బాబుని సౌండ్ లేకుండా వాయించేస్తున్నారు. ఇలా అన్నీ వైపులా మాటల దాడి జరగడంతో 40 ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబు పరిస్తితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: