ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జగన్ పరిపాలన విషయంలో దూసుకుపోతున్నారు.. అనుభవం లేకపోయినా సరే... తనను నమ్మిన వారికి జగన్ సంక్షేమ పథకాల రూపంలో న్యాయం చేస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని అవసరమైతే మార్కెట్ లో దొరికిన అప్పుని కూడా సంక్షేమానికి వినియోగిస్తున్నారు. ఇక ఈ సమయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... ప్రజలను ఆయన ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రతీ ఒక్కటి కూడా దూకుడు గా నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిల్లో కచ్చితంగా వ్యవహరిస్తున్నారు జగన్.

 

తాజాగా మహిళల రక్షణ కోసం జగన్ ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం పై అప్పుడే సోషల్ మీడియాలో జగన్ విమర్శకుల నుంచి ప్రసంశలు వస్తున్నాయి. ఏదైనా సరే స్పాట్ లో నిర్ణయం తీసుకోవడం జగన్ కి తండ్రి నుంచి వచ్చిన లక్షణం అని కొనియాడుతున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా ఎన్ని విమర్శలు వచ్చినా సరే జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన నిర్ణయానికి జగన్ కట్టుబడి ఉన్నారు.

 

అదే విధంగా... విద్యుత్ ఒప్పందాల విషయ౦లో అనుభవం లేక కాస్త దూకుడుగా అడుగు వేసినా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గారు జగన్. ఇక సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఆయన వెనక్కు తగ్గడం లేదు... అప్పులు చేస్తున్నారు అంటున్నా ఆదాయం రావడం లేదని అంటున్నా సరే జగన్ వెనక్కు తగ్గడం లేదు.

 

ఇది తెలుగుదేశం నేతలను, కేడ‌ర్‌ను ఫిదా చేసింది. చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే నెలలు తరబడి ఎదురు చూస్తారని కాని జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదని అసెంబ్లీ లాబీల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించుకుంటున్నారు. వాస్త‌వంగా కూడా చంద్ర‌బాబు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కొన్ని పోస్టులు నాలుగేళ్ల వ‌ర‌కు కూడా భ‌ర్తీ చేయ‌లేదు. ఇది ఆ నోటా ఈ నోటా పడి చంద్రబాబు వద్దకు చేరిందట. దీనిపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: