ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్లో దారుణ ఓటమి నుంచి ఆ పార్టీ ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నా... కార్యకర్తల్లో మాత్రం పార్టీ భవిష్యత్తులో విషయంలో మాత్రం అనేక భయాలు ఉన్నాయి. రాజకీయంగా జగన్ అత్యంత బలంగా ఉండటం తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. అసలు ఆ పార్టీ మాట కూడా ప్రజలు వినే పరిస్థితి లేదనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. చంద్రబాబు ఎంత మీడియా ముందు కనపడినా సరే...



ప్రజల్లో మాత్రం ఆయనపై నమ్మకం రావడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యాఖ్య పార్టీలో ప్రధానంగా వినపడుతుంది. తెలుగుదేశం పార్టీలో గతంలో పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన వాళ్ళను చంద్రబాబు మర్చిపోయారని అంటున్నారు. యరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్ విషయంలో ఆయన వైఖరి మారిందని అంటున్నారు. చింతమనేని జైలు నుంచి విడుదల అయిన తర్వాత కలిసిన చంద్రబాబు ఆ తర్వాత ఆయనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదట.



ఇటీవ‌ల చింత‌మ‌నేని అమ‌రావ‌తి వ‌చ్చి బాబును క‌లుస్తాన‌న్నా ఆయ‌న త‌ర్వాత మాట్లాడ‌దాం అని పీఏల‌తో చెప్పి పంపించేశాడ‌ట‌. ఇక అధికారం ఉన్న‌ప్పుడు య‌ర‌ప‌తినేనిని నెత్తిన పెట్టుకున్న బాబు.. ఇప్పుడు ఆయ‌న్ను కనీసం పట్టించుకోవడం లేదని టాక్‌? ఉత్తరాంధ్ర లో పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన వాళ్ళను ఆయన గుర్తించడం లేదని అంటున్నారు. యువకులు అనే పేరుతో చాలా మందిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోతున్నారు.



ఇక చంద్రబాబుని నమ్మి పార్టీలోకి వచ్చిన అమరనాథ్ రెడ్డి, అఖిల ప్రియ, సుజయక్రిష్ణ రంగారావు, జ్యోతుల నెహ్రు వంటి వారికి కూడా చంద్రబాబు వద్ద ప్రాధాన్యత తగ్గిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి... వాళ్ళను చంద్రబాబు కావాలని పక్కన పెట్టారని కొందరు అంటుంటే... వాళ్ళల్లో సామర్ధ్యం లేక పక్కన పెట్టారని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: