బాబుగారికి ఏమైంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు శీతకాలంలో చల్ల చల్లగా జరుగకుండా వేసవిలోని వేడిలా జరుగుతుంటే ఈ పగటి చంద్రుడు మాత్రం పగలు చుక్కలు ఎందుకు కనిపిస్త లేవనే బాధలో ఉన్నట్లుగా కనిపిస్తునాడు. జగన్ జిలుగులు వెలిగిపోతుంటే ఈయన ప్రతిష్ట మసిబారి పోతున్నట్లూగా ఫీలవుతు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్ధం కావడం లేదట తనతోటి నాయకులకు.

 

 

ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో జరిగే గమ్మత్తులు ఎన్నో బాబుగారి భాగోతం పైన చిటపటలాడుతుంటే అది చూసిన చంద్రయ్య కస్సు బుస్సు లాడుతున్నాడట. ఇదే విధంగా జరిగిన గమ్మత్తు ఏంటంటే ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఈ మాజీ సీయంతో కాసేపు చెడుగుడు ఆడాడు. అదేమంటే చంద్రబాబు సేవలు చాలని, ఆయన రెస్టు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఇదే కాకుండా చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు.

 

 

ఇకపోతే ఈ సభలో మేం జూనియర్స్‌.. చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇక వెనుకబడిన వర్గాలకు స్పీకర్‌ పదవి ఇచ్చే సమయంలో చంద్రబాబు  చైర్‌లో కూర్చోబెట్టేందుకు కూడా రాలేదు. ఇది ఒక ఓ మానసిక వ్యాధి. ముందుగా చంద్రబాబుకు పరీక్షలు చేయించాలి. జబ్బు నయం అయ్యాక అసెంబ్లీలోకి తీసుకురావాలి. ఇప్పటికే ఆయనకు 40 ఏళ్ల అనుభవం ఉందన్నారు. ఆయన చేసిన సేవలు చాలు. ఇక రెస్టు తీసుకోవచ్చు. మరొక ఆరు నెలల్లో చాలా చూస్తారని చంద్రబాబు బెదిరించారు.

 

 

చంద్రబాబు మాటలు వింటుంటే భయంగా ఉంది. మొన్న పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు వంగి ఉన్నారు. నిన్న అమరావతి వెళ్లి పడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దండ వేసుకున్నారు. బాబును చూస్తే భయంగా ఉంది. డాక్టర్‌కు చెప్పి ఆయనకు ఉన్న వ్యాధిని నయం చేయాలి. అంటూ ఎద్దేవా చేశారు.  ఇదే కాకుండా పదవి లేకున్నా పరపతి ఉండాలనే చందంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే తాను చేసిన పనులు ఎంత ఘనమైనవో చాటింపు వేసుకుంటున్నాడని వెటకారంగా మాట్లాడాడు సీదిరి అప్పలరాజు...

మరింత సమాచారం తెలుసుకోండి: