హిందీ బిగ్ బాస్ అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా మొదట్లో అంతగా కిక్కివ్వని ఈ షో ఇప్పుడు చివరి దశకు చేరుకునే సరికి రసవత్తంగా సాగుతుంది.. గత కొద్దిరోజులుగా ముఖ్యంగా అర్హన్ ఖాన్, రష్మీ దేశాయ్ లవ్ ఎపిసోడ్స్ షోకి హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తీసుకొస్తున్నాయని చెప్పాలి. గత శనివారం వీకెండ్ కా వార్ సమయంలో సల్మాన్ ఖాన్.. హౌస్‌లోకి అడుగుపెట్టి రష్మీకి అర్హన్ ఖాన్ గతం గురించి వివరించిన సంగతి తెలిసిందే.

 

 

అయితే సల్మాన్ ఈ టాపిక్ ఇంతటితో ఆగిపోవాలని.. మిగతా కంటెస్టెంట్లు ఎవరూ కూడా హౌస్‌లో చర్చించకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ మొండి ఘతంలా సల్మాన్ మాటలను ఖాతర్ చేయని అర్హన్ ఖాన్ మాత్రం షెఫాలీ బగ్గాతో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘రష్మీని మొదటిసారి కలిసినప్పుడు.. తన దగ్గర చిల్లిగవ్వ లేదని.. పూర్తిగా రోడ్డున ఉందని చెప్పాడు..

 

 

అయితే రష్మీ బ్రదర్ గౌరవ్ ఈ వ్యాఖ్యలపై కొంచెం ఘాటుగానే స్పందించాడు. తన సోదరి ఎప్పుడూ కూడా రోడ్డున పడలేదని గట్టిగా సమాధానమిచ్చాడు. అర్హన్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో తనకు అర్ధం కావట్లేదని తన సోదరి ఎప్పుడూ కూడా రోడ్డున పడలేదని..  కేవలం తన సోదరి పరువు తీయడానికే అర్హన్ కంకణం కట్టుకున్నాడని మండిపడ్డాడు. వీకెండ్ ఎపిసోడ్‌లో రష్మీకి జరిగిన దానికే చాలా బాధపడుతున్నాం.

 

 

ఇక ఇప్పుడు అర్హన్ ఖాన్ చెప్పే ఇలాంటి మాటలకు ఫ్యామిలీ అంతా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు’ అని గౌరవ్ వివరించాడు. తన సోదరి రష్మీ గతంలోనే చాలా బాధను అనుభవించిందని… మళ్ళీ ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ ఫేస్ చేస్తే తాము తట్టుకోలేమని గౌరవ్ వాపోయాడు. ఇక సల్మాన్ ఖాన్ ఎంత చెప్పినా.. అర్హన్ ఆ ప్రస్తావన తేవడం జరిగింది కాబట్టి.. ఈ వారం ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి అనుకుంటున్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: