దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబయిలో ఘోరం జరిగింది. 22 ఏళ్ల వయసున్న యువకుడి పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై సెంట్రల్ సబర్బన్‌ లో నివసించే ఒక యువకుడు (22) ఆదివారం (డిసెంబర్ 9) ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశాడు. అతడి ఫాలోవర్స్‌ లో ఉన్న నలుగురు వ్యక్తులు దానిని చూసి అడ్రస్ ను ట్రేస్ చేసి అతడిని మరీ కలుసుకున్నారు.

 

 

ఇన్‌ స్టాగ్రామ్‌ లో చాలా రోజులుగా ఫాలో అవుతున్నామని, మీకు అభిమానులమని చెబుతూ ఆ యువకుడిని మాటల్లోకి లాగారు. మీతో కాసేపు గడపాలని ఉందని చెప్పి వారు కోరడంతో అతడు సరేనన్నాడు. రెస్టారెంట్ సమీపంలోనే వారంతా కాసేపు కలిసి తిరిగిన తర్వాత ఆ యువకుడిని బలవంతంగా వాళ్ల కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

 

 

కదులుతున్న కారులోనే యువకుడిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. సోమవారం తెల్లవారు జామున అతడిని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు వారు. కాసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. 

 

 

ఈ సంఘటన వారు వెంటనే వీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌ కు తరలించారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై ఓక వైపు ఆందోళనలు కొసాగుతున్న ఇప్పుడు యువకుడిపై జరిగిన ఈ దారుణం ముంబయిలో కలకలం రేపింది. రానురాను దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయి అంటే ఇదే కాబోలు. మొత్తానికి అపరిచితులతో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: