తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. గ‌త కొంత‌కాలంగా..ముఖ్య‌మంత్రి కేసీఆర్ తొల‌గించబోయే మంత్రుల జాబితా ఇదేనంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డం...అందులో మంత్రి మ‌ల్లారెడ్డి పేరు వినిపించ‌డం...అయితే, ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత త‌న‌యుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై మ‌ల్లారెడ్డి బ‌హిరంగ స‌భ వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపించి త‌న పద‌వి కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం....రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, తాజాగా ఆయ‌న మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ భూ వివాదంలో వాచ్‌మెన్‌పై జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఆయ‌న‌ అల్లుడి పేరు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...బాబు ఇంత‌కంటే ఏం చేస్తాడు మ‌రి!

సికింద్రాబాద్ పాత బోయిన్‌పల్లి సర్వే నం.91లో శివ ఎన్‌క్లేవ్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో కాపలా ఉన్న వాచ్‌మన్‌పై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పంటించారు. 40 శాతం గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ భూవివాదానికి కారణమైన రెండువర్గాల్లో ఒక వర్గానికి రాష్ట్ర మంత్రి అండగా నిలవగా.. మరో వర్గం వెనుక అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల దన్ను ఉందని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా మంత్రి మ‌ల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్భంగా బోయిన్ పల్లిలోని తన కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బోయిన‌ప‌ల్లిలో జ‌రిగిన‌ దాడి ఘటనతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. ఆ విషయంలో తాము తలదూర్చ లేదని స్పష్టం చేశారు. తమ వద్దకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు వస్తుంటారని.. ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి లు కూడా అలాగే వచ్చి కలిశారని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టంతా మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి పైనే ఉందని పేర్కొన్నారు. తన నియోజకవర్గం కోసం దాదాపు 90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. 6 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. జవహర్ నగర్ కు 24 కోట్లు,ఫీర్జాది గూడ కు 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కోసం 144 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధులతో రాంకీ సంస్థ తో కలిపి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్నీ అతి త్వరలో ప్రారంభిస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: