ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహార శైలి పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . అత్యున్నతమైన పదవి లో కొనసాగుతున్న ఆయన, గత స్పీకర్లుగా భిన్నంగా వ్యవహరిస్తూ , తరుచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు . ఇటీవల అగ్రిగోల్డ్ వ్యవహారంపై స్పందించిన తమ్మినేని ... టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై రాజకీయ విమర్శలు చేసిన విషయం తెల్సిందే . స్పీకర్ పదవి లో కొనసాగేవారు రాజకీయాలకతీతంగా వ్యవహరించాల్సి ఉండగా  , ఆ విషయాన్ని తమ్మినేని విస్మరిస్తున్నట్లు గా కన్పిస్తోంది .

 

తాను స్పీకర్ పదవిలో కొనసాగుతున్నానన్న  విషయాన్ని మర్చిపోయి తరుచూ రాజకీయ విమర్శలు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది . స్పీకర్ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం ఏమిటన్న   వ్యాఖ్యలపై  ... తాను ముందు ఎమ్మెల్యేనని , ఆ తరువాతే స్పీకర్ నని పేర్కొంటూ, తమ్మినేని  తన వ్యాఖ్యలు సమర్ధించుకోవడం కన్పించింది  .    అయితే గతంలో స్పీకర్ పదవి లో కొనసాగిన వారు ముందు ఎమ్మెల్యేలు కాకుండానే స్పీకర్లుగా పనిచేశారా? అంటూ పలువురు ఎద్దేవా చేశారు .

 

అయినా స్పీకర్ చైర్ లో కూర్చున్న తరువాత కూడా తమ్మినేని తన నోటి దూకుడు తగ్గించడం లేదు . బుధవారం అసెంబ్లీ వేదిక ఆయన చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురి చేశాయి . ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై ఈ రోజే చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు . గురువారం చర్చిద్దామని స్పీకర్ పేర్కొన్నారు . అయినా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు ... అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతుండగానే అంతలోనే స్పీకర్ జోక్యం చేసుకుంటూ ఇదేమైనా ఖవ్వాలి డ్యాన్సా అడగగానే అవకాశం ఇవ్వడానికి  అంటూ టీడీపీ సభ్యులను  ప్రశ్నించడం సభలోని సభ్యులతో పాటు , టీవీ లో ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకిస్తున్నవారు  సైతం ఒక్కసారిగా  ఆశ్చర్యపోయారు .

మరింత సమాచారం తెలుసుకోండి: