వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. సోషల్ మీడియా సృజన, స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుంది. పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారు. పేరు వైరల్ అయిందీ. అందుకే అనుకుంటా ఇకపై తనను పవర్ స్టార్ అని పిలవొద్దని పిలుపునిచ్చాడు. ఆలోచనల్లో పరిపక్వత లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడి పరువు గంగలో కలుపుకుంటున్నారు.'' అంటూ ట్విట్ చేశారు. 

 

పావలా కళ్యాణ్ కు ఇప్పటీకే బెత్తం స్టార్ అని అన్నారు అని.. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతన్ని పవర్ స్టార్ అని పిలువొద్దని పిలుపు ఇచ్చినట్టు విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. కాగా ఈ ట్విట్ చుసిన నెటిజన్లు పవన్ కళ్యాణ్ పై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: